విశ్రాంతి లేని లోకంలో విశ్రాంతి

విశ్రాంతి లేని లోకంలో విశ్రాంతి

Summary

ఒత్తిడి మరియు అధికమైన పని చాలా మందిని వారి అంతిమ సమయం ఆశన్నమవ్వకముందే సమాధికి తెస్తుంది. కానీ సృష్టి ప్రారంభంలోనే, దేవుడు ఒత్తిడి సమస్యకు నివారణను రూపొందించాడు: విశ్రాంతి దినం. మానవులు తమ పని నుండి విశ్రాంతి తీసుకోవడానికి మరియు దేవునితో సమయాన్ని గడపడానికి ఈ పరిశుద్ద దినం ఒక ఆశీర్వాదంగా రూపొందించబడింది. అభాగ్యవశాత్తూ, ప్రజలు దీనిని గుర్తుంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ, చాలా మంది ఈ ప్రత్యేకమైన దినం గురించి మరిచారు మరియు చాలామంది దానిని వారికి ఇచ్చిన సృష్టికర్తను కూడా మరిచారు.

Type

Tract

Publisher

Sharing Hope Publications

Available In

25 Languages

Pages

6

Download

మితా దురాన్ మరణించింది. చురుకైన, 24 ఏళ్ల ఇండోనేషియా కాపీరైటర్ ఆమె బల్ల వద్ద కూలబడిండి. ఏమి జరిగింది? 

మితా ఒక ప్రకటన చేసే సంస్థలో పనిచేసింది, అక్కడ అంచనాలు ఎక్కువ ఉన్నాయి మరియు పని భారం ఎక్కువగా ఉంది. ఆమె మరణించడానికి కొంచెము ముందు, ఆమె సామాజిక మాధ్యమాల్లో తన అలసట గురించి వ్యాఖ్యానించింది: “ఈ రాత్రి, ఎనిమిదొ రోజు కూడ నేను నేరుగా ఆఫీసుకి తాళాలు తీసుకెళ్తా.... నాకు జీవము లేదు.”

రెడ్ బుల్ యొక్క ఆసియా వెర్షన్ అయిన క్రేటింగ్ డేంగ్ అనే కెఫిన్ కలిగిన పానీయంపై ఆమె ఎక్కువగా ఆధారపడెను. ఆమె ఆన్‌లైన్‌ వ్యాఖ్య చెప్పిన చివరి మాట: “30 గంటలు పని చేస్తున్నాను మరియు ఇంకా బలంగా కొనసాగుతున్నాను.” ఆమె ఆ తర్వాత తన బల్ల వద్ద కుప్పకూలింది, మరియు ఎప్పుడూ మేల్కొనలేదు. 

ఏమైంది? మితా అధిక పని వలన మరణించింది.

నేడు, మనలో చాలా మంది తీరికలేక పని ఒత్తిడి కలిగియన్నారు. సమాజము మనల్ని ఎక్కువగా పని చేయమని, ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ కొనమని ప్రోత్సహిస్తుంది. మనము ఒత్తిడి, నిద్రలేమి మరియు ఆందోళనతో బాధపడుతున్నాము. 

మితా దూరన్ లాగా మనల్ని మనం చంపుకొనకపోవచ్చు, కానీ జీవితం చాలా భారం అవ్వగలదు. దేవుడు మన కోసం ఉద్దేశించినది ఇదేనా? ఆయన శాంతి ప్రదాత. మనం ఎక్కువగా పని చేసినప్పుడు, మనము ప్రశాంతంగా ఉంటామనిపిస్తోందా? అస్సలుకాదు!

మనం అలసటతో పొంగిపోయామంటే, అప్పుడు మరి అది ఎందుకనగా దేనిని గుర్తుంచుకోవాలని దేవుడు కోరుతున్నాడో దానినే మనం మరుస్తున్నాము. విశ్రాంతి గురించి ఆయన ఏమి చెప్పాడో తెలుసుకుందాం. 

“పాజ్” బటన్ నొక్కుట

దేవుడు అత్యంత కనికరము మరియు కరుణ గలవాడు. సెల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్ లాగా మానవులకు వారి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని నింపుకోడానికి సమయం అవసరమని ఆయనకు తెలుసు. కాబట్టి, ప్రవక్త మోషే (మూసా అని కూడా పిలుస్తారు) దేవుని యొక్క ఆజ్ఞ వ్రాసాడు:

విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవు ఏ పనియు చేయకూడదు (తవ్రత్ అని కూడా పిలువబడే బైబిల్ మొదటి భాగం నుండి: నిర్గమకాండము 20:8-10).

మార్చలేని దేవుని ధర్మశాస్త్రం ఏడవ దినమును గుర్తుంచుకోమని చెబుతుంది. ప్రపంచంలోని అనేక భాషల ప్రకారం, విశ్రాంతి కోసం అంకితం చేయబడిన ఈ ఏడవ దినమును “సబ్బాతు” అని పిలుస్తారు. దానిని గుర్తుంచుకోమని దేవుడు మనకు ఎందుకు ఆజ్ఞాపించాడు? ఎందుకంటే మతిమరుపు అనేది ఆదాము నుండి మొదలుకొని మానవజాతితో కొనసాగుతున్న సమస్య అని ఆయనకు తెలుసు. మనం దేవుని ఆజ్ఞలను మరువకూడదు, ఎందుకంటే మనం ఆయనను మరియు ఆయన ఆజ్ఞలను గుర్తుంచుకుంటేనే మనం నిజమైన మార్గంలో నడుస్తుంటాము.

అయితే సబ్బాతు ఎందుకు ప్రత్యేకమైనది? దేవుడు మనకు చెప్తాడు:

ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించి, ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్దపరచెను (నిర్గమకాండము 20:11).

దేవుడు సృష్టికర్త అని సబ్బాతు ఒక ముఖ్యమైన గుర్తు. దేవుడు అలసిపోడు కాబట్టి, ఆయన ఏడవ దినమున తీసుకొను అవసరం లేదని కొందరి అభ్యంతరం. కానీ దేవుడు అలసట నుండి విశ్రాంతి తీసుకోలేదు; ఆయన తన సృష్టి అపాడు సృజనాత్మక పనిని పాజ్ చేసాడు, తద్వారా అతను మనము విశ్రాంతి తీసుకొనునట్లు పవిత్ర సమయాన్ని కేటాయించాడు.

మానవాళికొక విశ్రాంతి దినము మంచిదని దేవుడు చూశాడు. ఆయన ఏడవ దినమును సబ్బాత్‌గా చేసాడు, అంటే విరామం లేదా పాజ్ అని అర్థం. అందువల్ల, ప్రతి వారంలోని ఏడవ దినము “పాజ్” అను బటన్ నొక్కడానికి ప్రత్యేకమైన రోజు. ఆయనను స్మరించడానికి మరియు ఆరాధించడానికి మనము పని మరియు అపవిత్ర కార్యాల నుండి వొక రోజంతా విశ్రాంతి తీసుకోవాలి. 

మీ అధికారి లేదా మీ ఆచార్యులు మిమ్మల్ని ఎక్కువ విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపిస్తే అది మంచిది కాదా? కాని దేవుడు నిశ్చయముగా ఆజ్ఞాపించినది ఇదే! దేవునికి స్తుతి! ఆయన నిజంగా దయగలవాడు! 

దేవుని దినమును పరిశుద్దముగా ఉంచుట

విశ్రాంతి దినము లోకంలోని ప్రజలందరికీ సార్వత్రిక పవిత్రమైన దినము. యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధులు లేదా హిందువులు ఉనికి కన్నా ముందే, సృష్టికర్త దేవునియందు విశ్వాసము ఉంచిన ఏక దేవతారాధన విశ్వాసులచే ఇది ఆచరించబడింది. వాస్తవానికి, ప్రపంచం సృష్టించబడినప్పుడు ఇది మానవాళికంతటికి ఇవ్వబడింది. ఆదాము మరియు హవ్వ (హవ అని కూడా అంటారు) విశ్రాంతి దినమును పాటించారు మరియు గుర్తుంచుకోవాలని దేవుడు మనకు చెప్పిన వాటిని మరవడానికి దేవుడు మనకు ఎన్నడూ అనుమతి ఇవ్వలేదు. 

అభాగ్యవశాత్తు, సబ్బాతు తరచుగామరవబడుతోంది. విశ్రాంతి దినమును మరచిపోతే దేవుడు వారిపై వినాశనం తెస్తాడని ప్రవక్తలు ప్రాచీన యూదులను హెచ్చరించారు. వారు హెచ్చరికను వినలేదు, కాబట్టి యెరూషలేము నాశనం చేయబడింది, మరియు వారి కుటుంబాలు చెరలోకి తీసుకువెళ్లబడ్డాయి. క్రైస్తవులు కూడా దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా తమ పరిశుద్ద దినాన్ని ఆదివారానికి మార్చుకోవడం చేత విశ్రాంతి దినమును మరిచారు. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేస్తారు కానీ సృష్టికర్తకు పూర్తి విధేయతలో జీవించడానికి ఏడవ దినమున మనం విశ్రాంతి తీసుకోవాలని మర్చిపోకూడదు. 

లోకమంత ఈ ముఖ్యమైన దినమును మరచిపోతున్నట్లు ఎందుకనిపిస్తుంది? విస్తృత మరుపుకు ఇంతకంటే దుర్మార్గమైన కారణము మరొకటేదైనా ఉందా?

యేసు అయిన మెస్సీయ (ఈసా అల్-మసీహ్ అని కూడా పిలవబడిన) మన సృష్టికర్త నుండి మన మనస్సులను దూరం చేయడానికి సాతాను (షైతాను) ఉపయోగించబోవు ప్రపంచవ్యాప్త శక్తి గురించి హెచ్చరించాడు. తప్పుడు విశ్రాంతి దినమున ఆరాధించడంలో లక్షలాది మంది మోసపోతారు. సాతాను మనల్ని సృష్టికర్త యెహోవా మరచిపోయేలా చేయగలిగితే, మనం సృష్టికర్తను కూడ మరుస్తామని అతడు ఆశిస్తున్నాడు. అయినప్పటికీ, మనం నిజమైన విశ్రాంతి దినమును పాటించినప్పుడు, మన సృష్టికర్తకు మన విధేయతను చూపుచున్నాము మరియు విశ్రాంతి, మనశ్శాంతి మరియు సమాధానము అనే బహుమతులను ఆనందిస్తాము.

దేవుని విశ్రాంతిలో ప్రవేశించుట

మోషే ప్రవక్త “కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను” అని వ్రాసెను (ఆదికాండము 2:3). మీరు అలసి మరియు సోలిపోయారా? సబ్బాత్‌లో ఆశీర్వాదాలు ఉన్నాయి! 

ఇండోనేషియాకు చెందిన కాపీరైటర్ మితా దురాన్, అధిక పని భారము వలన మరణించింది—కానీ మీరు అలా చేయనక్కరలేదు. ప్రతి వారం మీ పనుల నుండి విశ్రాంతి తీసుకోవాలని మరియు విశ్రాంతి దినము యొక్క దీవెనలను అనుభవించమని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. 

దేవుడు మనకు విశ్రాంతి, సమాధానము మరియు స్వస్థతను ఎలా ఇస్తాడు అనేదాని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్ములను సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover