మీకు అద్భుతం అవసరమా?

మీకు అద్భుతం అవసరమా?

Summary

దేవుడు తన ప్రజలకు అత్యంత అవసరమైనప్పుడు వారికి అద్భుతాలను అందించిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాడు. బైబిల్ మనకు నెరవేరిన ప్రవచనాలు, స్వస్థత పొందిన వ్యక్తులు మరియు ప్రార్థనకు జవాబుగా మాత్రమే వచ్చే అద్భుతమైన సంఘటనల గురించి చాలా కథలను చెబుతుంది. ఈ కరపత్రం బైబిల్‌ను మారని దేవుని వాక్యంగా ఎందుకు విశ్వసించవచ్చో మరియు మీ స్వంత అద్భుతం కోసం మీరు దేవుడిని ఎలా సంప్రదించవచ్చో అనే అనేక కారణాలను అందిస్తుంది.

Type

Tract

Publisher

Sharing Hope Publications

Available In

25 Languages

Pages

6

Download

పెద్ద వంశమునకు చెందిన కుటుంబ సభ్యులంత మెరుగైన జీవితం కోసం ఎంతో ఆశపడ్డారు మరియు మరో దేశానికి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం, అయితే, సులభం కాదు; వారు కాలినడకన ఒక పెద్ద ఎడారిని దాటవలసి వచ్చింది. అక్కడ పాములు, తేళ్లు మరియు తీవ్రమైన వేడి ఉండెను. జబ్బుపడినవారు లేదా బలహీనమైన వంశ సభ్యులు వలన ప్రయాణం వెనుక పడితే బందిపోట్లు వారి పైన దాడిచేసారు.

త్వరలోనే వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, కానీ వారి నాయకుడు ఒక అద్భుతం చేయమని దేవునికి మొర పెట్టాడు. మరుసటి రోజు, ప్రజలు మేల్కొన్నప్పుడు, నేల అంతటా చెల్లాచెదురుగా రొట్టెలా ఉండే చిన్న ముక్కలు కనిపించాయి. ఇది తేనెతో కూడిన పొరల కరకరమను రొట్టెలవలే రుచిగా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరికి ఆకలిని తీర్చడానికి తగినంత ఆహారం ఉంది! ఎడారిని దాటడానికి చాలా రోజులు పట్టింది, మరియు ప్రతి రోజు పరలోకము నుండి రొట్టెల వర్షం కురిసింది. దేవునికి స్తోత్రము, వారు రక్షించబడ్డారు!

ఈ కథ ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా జరిగింది. బైబిలులో చెప్పబడిన అనేక అద్భుతాలలో ఇది ఒకటి, తవ్రత్, జబూర్ మరియు ఇంజీల్ పేర్లతో మీరు తెలుసుకోవచ్చు. బైబిల్లో వందలాది నిజమైన కథలు ఉన్నాయి, వాటిలో చాలా వరకు ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాల ఆధారంగా ఉన్నాయి. చాలా మంది వారి జీవితములో అద్భుతాలు అవసరమైనవి కాబట్టి, ఇది మన కాలానికి ఒక ముఖ్యమైన పుస్తకమైనది.

ఆధునిక-దినాలలో అద్భుతాలు

ఇటీవలి సంవత్సరాలలో, మనము అంతర్యుద్ధాలు, విప్లవాలు, ఆర్థిక పతనం, నిరుద్యోగం, అంటు వ్యాధులు మరియు మరణాలను చూశాము. ప్రస్తుతం మీ పరిస్థితి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. మీరు మీ ఇంటి నుండి దూరము చేయబడవచ్చు. జీవితం మరియు మరణం మధ్య తక్కెడలో వేలాడుతున్న ప్రియమైన వ్యక్తిని కలిగి మీరు ఉండవచ్చు. ఉద్యోగం సంపాదించుట కొరకు నీవు ఎంతో కష్టపడవచ్చు. 

మీ పరిస్థితి ఏమైనప్పటికీ, దేవుడు మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు పురాతన కాలంలో అద్భుతం చేసినట్లు ఈ రోజు కూడా మీ కోసం ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు విచారంగా ఉన్నప్పుడు, అద్భుతాల యొక్క పుస్తకమైన, బైబిల్ చదవడం చేత మీరు ప్రోత్సాహము కనుగొనగలరు.

మన కాలానికి దేవుని మాటలు

కొంతమంది బైబిలును చదవడానికి వెనుకాడతారు ఎందుకంటే అది ఏదో ఒక విధంగా మార్చబడిందని వారు విన్నారు. బైబిలును అనుసరిస్తున్నామని చెప్పుకునే చాలా మంది వ్యక్తుల జీవనశైలి వల్ల బహుశా ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కొన్నిసార్లు క్రైస్తవులు మద్యం సేవించడం, జూదం ఆడడం, అనాగరికంగా దుస్తులు ధరించడం, పంది మాంసం తినడం మరియు ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం మనం చూస్తాము. 

ఆయితే నిజానికి, ఈ తప్పులన్నీ బైబిల్లో ఖండించబడి ఉన్నాయి. క్రైస్తవులు దేవునికి అవిధేయతలో జీవించినప్పుడు, ఇది ఆయన శాశ్వతమైన వాక్యం యొక్క చెల్లుబాటును ఎన్నటికి మార్చదు. యెషయా ప్రవక్త ఇలా వ్రాసెను, “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును” (యెషయా 40:8). మానవులు దేవుని వాక్యాన్ని మార్చగలుగు శక్తిమంతులని మీరు తలుస్తున్నారా లేదా వారు కేవలం చెడు ప్రవర్తనతో తప్పుగా సూచిస్తున్నారని ఎక్కువ నమ్మదగినదా? 

దావీదు ప్రవక్త (దావూద్ అని కూడాప్రసిద్ధి) మరియు అతని ప్రజలు నిబంధన మందసము అనగా, పది ఆజ్ఞలను కలిగి ఉన్న పెద్ద బంగారు పెట్టెను రవాణా చేస్తూన్న ఒక సమయమును గూర్చి బైబిలు చెబుతుంది. పది ఆజ్ఞలు నైతిక జీవనం కోసం దేవుని చట్టాలు మరియు రెండు పెద్ద రాతి పలకలపై వ్రాయబడి బంగారు మందసములో ఉంచబడెను. ఊరేగింపులో, ఒక వ్యక్తి మందసాన్ని సమీపించడానికి మరియు తాకడానికీ ధైర్యం చేసాడు—మరియు అతను వెంటనే చనిపోయాడు! 

దేవుడు తన వాక్యాన్ని కలిగి ఉన్న పవిత్ర మందసమును అహంకారపూరితమైన చేతులు తాకడానికి అనుమతించకపోతే, ఇక కత్తెరతో మరియు సరిచేయు కలముతో తన వ్రాతపూర్వక వాక్యామును చేరడానికి దుష్టులను ఎంత తక్కువగా ఆయన అనుమతిస్తాడు? దేవుడు తన వాక్యాన్ని రక్షించుకొనే అంత గొప్పవాడు.

నిష్పాక్షికంగా చెప్పాలంటే, మానవ చరిత్రలో బైబిల్ అత్యంత ధృవీకరించబడిన గ్రంథం. కొంతకాలం క్రితం, పాలస్తీనాలోని ముగ్గురు బెడౌయిన్ గొర్రెల కాపరులు—ముహమ్మద్ ఎద్-ధిబ్, జుమా ముహమ్మద్ మరియు ఖలీల్ మూసా—అనుకోకుండా మృత సముద్రం గ్రంథం చుట్లను కనుగొన్నారు. దాదాపు 2,000 సంవత్సరాల నాటి పురాతన బైబిలు వ్రాతలు నేటి బైబిలు పోల్చడానికి ఇది మాకు అనుమతించిన ప్రధాన పురావస్తు పరిశోధన. ఆ ఈ కలయక ఆశ్చర్యకరంగా ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షతలను మార్చలేము అనే వాస్తవాన్ని మళ్లీ సూచిస్తుంది. మీకు ఒక అద్భుతం కావాలంటే, బైబిలు చూడండి అది నమ్మదగిన స్థలం అని మీకు నిశ్చయం కలుగుతుంది! ఇక్కడ మీరు నొవాహు (నూహ్), అబ్రహాం (ఇబ్రహీం), యోసెపు (యూసెఫ్), యోన (యూనస్), దానియేలు, దావీదు (దావూద్) మరియు సలోమాను (సులేమాన్) వంటి ప్రవక్తల గురించి అద్భుతమైన కథనాలను కనుగొంటారు. మీరు ఇతర ప్రదేశాలలో వారి గురించి కొంచము విని ఉండవచ్చు, కానీ బైబిలు కథను మొత్తం చెబుతుంది!

రండి మీ అద్భుతాన్ని కనుగొనండి

మీరు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బైబిలు మీ కోసం ఒక అద్భుత కథను కలిగి ఉంది:

  • మీరుగాని లేదా ప్రియమైన వ్యక్తిగాని అనారోగ్యంగా ఉన్నారా? కుష్టు వ్యాధితో బాధపడుతున్న సిరియా సైన్యాధిపతి నయమాను అద్భుతంగా స్వస్థపరచడం గురించి చదవండి. 

  • మీరు మీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నారా? లెబనీస్ విధవరాలు మరియు ఆమె కొడుకు గురించి చదవండి, ఒక చిన్న పాత్రలో నూనె మరియు ఎప్పటికీ అయిపోని గుప్పెడు పిండితో సుదీర్ఘ కరువు నుండి బయటపడింది. 

  • మీ ప్రాణం ప్రమాదంలో ఉందా? రాజ మందిరములో కూషీయుడగు బానిస ఎబెద్-మెలెక్, గురించి చదవండి, దేవునిపై విశ్వాసం ఉన్నందున యుద్ధ సమయంలో అతని ప్రాణం రక్షించబడింది. 

  • మీరు అంటరానివారుగా ఉన్నట్లు భావిస్తున్నారా? ఐగుప్తురాలైన హాగర్ తిరస్కరించబడినప్పుడు దేవుని యొక్క అద్భుతాలను చూసింది ఆమె గురించి చదవండి.

  • మీరు జీవిత కష్టాల క్రింద మునుగుతున్నారా? యేసుక్రీస్తు తన చేతిని చాచి ఒక బలమైన తుఫానును నిమ్మళపరచి తన శిష్యులను పడవ ప్రమాదం నుండి రక్షించిన దాని గూర్చి చదవండి.

అద్భుత సమాధానాలు

మనం బైబిలు చదువుతున్నప్పుడు, సానుకూల అంచనాలతో ప్రార్థించాలనే విశ్వాసంతో నిండిపోతాం. యేసు క్రీస్తు, “మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను” (మత్తయి 21:22). ప్రభువు నుండి అద్భుతాలను పొందిన ఇతరుల కథలను మనం చదివినప్పుడు, మన హృదయాలు మన విన్నపాలను పరలోకానికి చేరాలనే ఆశతో ప్రేరేపించబడతాయి.

మీకు ఒక అద్భుతం అవసరమా? బైబిల్లోని అద్భుతాల నుండి ప్రేరణ కలిగి మీ వ్యక్తిగత జీవితములో అద్భతం జరగాలని దేవుణ్ణి అడగండి. ఆయన ఈ రోజు మీ ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు!

మీరు బైబిల్లోని అద్భుతాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover