మీ కొరకు మీరు ఆలోచించడం ఎలా

మీ కొరకు మీరు ఆలోచించడం ఎలా

Summary

"బాబిలోన్" అనే సంకేత నామం ద్వారా వర్ణించబడిన ప్రమాదకరమైన మతపరమైన శక్తి గురించి దేవుని ప్రవక్తలు ముందే వెల్లడించారు. ప్రవచనం ప్రకారం, ఈ శక్తి మనల్ని అబద్ధ ఆరాధనలోనికి బలవంతంగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తుంది. మనం సురక్షితంగా ఉండగల ఏకైక మార్గం యేమిమిటంటే, మన గురించి ఆలోచించడం మరియు బయలుపరచబడిన దేవుని వాక్యానికి కఠినమైన విధేయతను కొనసాగించడమే. ప్రపంచవ్యాప్త సంక్షోభ సమయాల్లో మనం తెలివైన, ఆలోచనాపరులైన విశ్వాసులుగా ఉండేందుకు మన మనస్సులను ఏవిధంగా నియంత్రించుకోవాలో ఈ కరపత్రం చెబుతుంది.

Type

Tract

Publisher

Sharing Hope Publications

Available In

25 Languages

Pages

6

Download

సుదీర్ఘ పాదయాత్ర తర్వాత మేము గునుంగ్ డాటుక్ శిఖరానికి చేరుకున్నాము. నేను దృశ్యాలను ఆస్వాదించడానికి, నా కొత్త స్నేహితుడు అడ్జాక్‌తో క్రింద కూర్చున్నాను. కొద్దిపాటికే, మా సంభాషణ మత విషయాలకు మళ్లింది.

“నేను స్వేచ్ఛా యోచకుడను,” అని అడ్జాక్ పేర్కొన్నాడు. “ప్రపంచం గురించి నా స్వంత అభిప్రాయాలు నాకున్నాయి.”

“అవును,” నేను బదులిచ్చాను. “చాలా మంది మలేషియా యువత స్వేచ్ఛా ఆలోచనాపరులుగా గుర్తించడాన్ని నేను విన్నాను.” 

అద్జాక్ నవ్వాడు. “మనకు మనం ఆలోచించుకోవాలి. లేకపోతే చాలా గందరగోళం ఉంటుంది. ఇది నిన్ను వెర్రివాడిని చేస్తుంది.”

“అయితే నీవు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమిటి?” అని నేను అడిగాను. “ఇక్కడ మలేషియాలో, చాలా మంది యువకులు తమను తాము స్వేచ్ఛా ఆలోచనాపరులుగా పిలుచుకుంటారు, కానీ ఇంట్లో నీవు ఇస్లాము లేదా బౌద్ధ ఆచారాలలో పాల్గొనాల్సి ఉంటుంది. నీవు నీ తల్లిదండ్రులకు ఏమి చెబుతున్నావు?”

“నేను వారికి చెప్పను,” అని అడ్జాక్ బదులిచ్చాడు. “నేను వారికి కావాల్సినట్లే చేస్తున్నాను. నేను స్వేచ్ఛగా ఆలోచించగలను, అయితే దానిని నాలోనే ఉంచుకోవాలి.”

స్వేచ్ఛగా ఆలోచించడం ముఖ్యమా?

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, భిన్నమైన నమ్మకం కలిగి ఉండటం వలన నీ సంఘం నుండి నీవు బహిష్కరించబడొచ్చు, నీ ఉద్యోగం నుండి తొలగించబడొచ్చు లేదా చంపబడొచ్చు కూడ. నీకు నీవు ఆలోచించడం ప్రమాదం కావచ్చు. అయితే అది ముఖ్యమా? 

మన ప్రపంచం మంచి ఆలోచనలు మరియు చెడు ఆలోచనలతో నిండిండి. చెడు నుండి మంచిని చెరగడానికి ముఖ్య మార్గం ఏంటంటే వాటి గురించి ఆలోచించి, మాట్లాడడమే. మీరు బంగారం, కుంకుమపువ్వు లేదా ఐఫోన్—వంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తే, మీరు నేరుగా చెల్లించరు మరియు ఇంటికి తీసుకొని వెళ్ళరు. నిజంగా మంచి నాణ్యత గల దానిని పొందుతున్నానా లేదా అని పరీక్షిస్తావు మరియు ఇతర పోటీదారుల యొక్క వస్తువులతో సరిపోల్చుకొని నిర్ధారించుకుంటావు. ఆలోచనలను అదే విధంగా పరిగణించాలి. 

ప్రపంచంలో చాలా గందరగోళం ఉంది మరియు ప్రజలు తమ స్వంత అయోమయ ఆలోచనలు సంఘంపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినప్పుడు అది మరింత దిగజారుతుంది. ఒక ముఖ్యమైన ప్రవచనం గురించి మీకు చెప్తాను. “యేసు క్రీస్తును బయలుపరిచే గ్రంథం” చాలా పాత పుస్తకంలో, ఒకటి గందరగోళ మతపరమైన అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించే వ్యక్తుల గురించి ఒక ప్రవచనం చెబుతుంది. అది చెబుతోంది: “మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్తజనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను, కూలిపోయెను” అని ( ప్రకటన 14:8).

ఈ చిహ్న పదాలను అర్థం చేసుకోవడం కష్టం కాదు. బబులోను ఒక ప్రసిద్ధిగాంచిన పురాతన నగరం, కానీ దాని పేరు యొక్క అర్థం “గందరగోళం.” ఈ నగరం “కూలిపోయినది,” అది అయోమయంలో ఉన్నందున కాదు కానీ తన గందరగోళాన్ని విడవడానికి ఇష్టపడనందుకు. ఆమె తన ఆధ్యాత్మిక వ్యభిచారంలో పడవేయుటకు దేశాలను మోహింపజేస్తుంది—అంటే, సత్యారాధనను మరియు తప్పుడు ఆరాధనను మిళితము చేయుట చేత దేవుణ్ణి మోసగించుట. ఈ తప్పుడు ఆలోచనలు సాధారణము చేయబడ్డాయి మరియు అంగీకరించబడ్డాయి. “బబులోను” గురించిన ఈ ప్రవచనం ఆధ్యాత్మిక లోపాన్ని సాధారణముగా చేయటమే కాకుండా చివరికి సత్యాన్ని వెంబడిస్తున్న వ్యక్తులపై బలవంతం చేయడానికి ప్రయత్నించే ప్రపంచమంత వ్యాప్తి చెందిన ఆధ్యాత్మిక సంస్థను సూచిస్తుంది.

ఇది మన రోజుల్లో సంభవిస్తుందని యేసు క్రీస్తు యొక్క ప్రకటన ప్రవచించింది. ఇప్పటికే ఇది జరుగుతుండడం మీరు చూసి ఉండవచ్చు. తప్పుడు ఆలోచనలతో దేవునికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు ఉన్నారా? మీ మనస్సాక్షిలో మీకు అసౌకర్యంగా అనిపించిందా?

అవును, అందుకే స్వేచ్ఛగా ఆలోచించడం ముఖ్యం.

నీకు నీవు ఎలా ఆలోచించాలి

చాలా మంది ప్రజలు వారి సమాజము యొక్క మతాన్ని అనుసరించడానికి సంతృప్తి పడతారు. వారు తమ విశ్వాసము ద్వారా ఆలోచించరు. వారు అర్థంలేని మతపరమైన సంప్రదాయాలను లేదా మంచి కంటే ఎక్కువ హాని కలిగించే దానిని అనుసరిస్తారు. కొన్నిసార్లు, మనకు దేవుని మార్గాన్ని చూపవలసిన మత పెద్దలు కూడా దుష్టత్వముతో నింపబడ్డారు.

మనం సత్యాన్ని ఎలా కనుగొనగలం? మనం ప్రవక్తలను నమ్మాలని నేను సూచిస్తున్నాను. ఎందుకు? మూడు కారణాలు ఉన్నాయి:

  1. ప్రవక్తలు భవిష్యత్తు గురించి అద్భుతమైన జ్ఞానాన్ని చూపుతారు. ఐరోపా దాని యొక్క చారిత్రక స్థానానికి లేస్తుందని మరియు ప్రపంచాన్ని వలసరాజ్యం చేస్తుందని దానియేలు ప్రవక్త ప్రవచించెను. యేసు క్రీస్తు (ఇసా అల్-మసీహ్ అని కూడా ప్రసిద్ధి) క్రీశ 70 లో యెరూషలేలేస్తు నాశనం అవుతుందని ప్రవచించాడు. ప్రవక్త అయిన మోషే (మూసా) ఇష్మాయేలు చరిత్రను చివరి సమయం వరకు ప్రవచించాడు.

  2. ప్రవక్తలు ఆరోగ్యం గురించి అద్భుతమైన శాస్త్రీయ జ్ఞానాన్ని చూపుతారు. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం జీవించిన మోషే ప్రవక్త దిగ్బంధం, మురుగునీటిని శుద్దిచేయటం మరియు క్రిమిరాహిత్యకరణం యొక్క సూత్రాలను వివరించెను. అతడు జంతు సృష్టిని పవిత్రమైనవి మరియు అపవిత్రమైనవిగా విభజించెను. ఇంకా మనం పవిత్రమైన మాంసాన్ని తినేటప్పుడు దాని రక్తం లేదా కొవ్వు తినకూడదని చెప్పెను. నేటికీ, ఆయన ఆహార మరియు పారిశుధ్యం నియమాలను పాటించే వారు సాధారణ జనాభా కంటే 15 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు.

  3. దేవుడు తనను విశ్వసించిన మరియు తన ప్రవక్తలను విశ్వసించిన విశ్వాసుల ప్రార్థనలకు జవాబిస్తాడు.

ప్రవక్తల రచనలు మార్గదర్శకత్వంతో నిండి ఉన్నాయి—కాని వాటి నుండి ప్రయోజనం పొందాలంటే, మనం విమర్శనాత్మకంగా ఆలోచించడం, మన నమ్మకాలను పరీక్షించడం మరియు మన విశ్వాస సంబంధిత ఆధారమును పరిశీలించడం నేర్చుకోవాలి. ఆలోచించడమనేది నిజమైన మతంలో ఒక ముఖ్యమైన భాగం.

ఇప్పుడు, మనము తప్పును పరిశోధించినప్పుడు ఏమి జరుగుతుంది? ఇది నిజం అనిపించవచ్చు మొదట్లో. అయితే మనము సాక్ష్యం కోసం వెతుకుతున్నప్పుడు, మనము ఆలోచనతో సమస్యలను చూడటం ప్రారంభిస్తాము. 

నిజం కేవలం వ్యతిరేకం. జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అది ఎప్పుడూ దేనినీ కోల్పోదు. మనం ఎంత ఎక్కువగా పరిశోధిస్తే, అంత నిజం మనం చూస్తాం. 

విశ్వాసులు ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనలను జ్ఞానము యొక్క మార్గంలో నడిపిస్తాడు. మీరు స్వేచ్ఛగా ఆలోచించడానికి లేదా ప్రశ్నలు అడగడానికి అనుమతిలేని పరిస్థితిలో ఉన్నారనిపిస్తే, అది దేవుని నుండి వచ్చినది కాదు. ఆయన మన నిశిత విచారణను ఆహ్వానిస్తున్నాడు ఎందుకంటే సత్యం పరిశీలనకు నిలబడేంత బలంగాఉంటుంది. కానీ బబులోను మిమ్మల్ని అబద్ధంలోకి కవ్విస్తుంది మరియు మేధో ప్రయత్నాల తలుపును మూయడంచేత మిమ్మల్ని అక్కడ బంధిస్తుంది.

మీరు బబులోనులో ఉన్నారు అని మీకు అనిపించేంత గందరగోళంగా ఉంటే, బయటకు రండి! దేవుని జ్ఞానము యొక్క మార్గములోనికి రండి. మీకు మీరు ఆలోచించండి మరియు కఠినమైన ప్రశ్నలు అడగండి. మీరు నిరాశచెందరు. 

మీరు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి ఈ కరపత్రం వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover