
కనికరం కొరకు తహతహలాడుట
Summary
దేవుని కనికరంఎలా ఉంటుంది? ఆయన కేవలం "నేను నిన్ను క్షమిస్తున్నాను" అని అంటాడా లేదా మన అవమానకరమైన నమోద్ పట్టికను ప్రక్షాళన చేయడానికి ప్రత్యామ్నాయం ఇస్తాడా? ప్రత్యామ్నాయ త్యాగం యొక్క అవసరాన్ని మరియు అర్థాన్ని వివరించడంలో సహాయపడటానికి ఈ కరపత్రం స్వదేశీ కథనాన్ని పంచుతుంది. పాఠకులు తమ పాపం క్షమించబడుతుందని మరియు తమ అవమానాన్ని తొలగించవచ్చని తెలుసుకోవడంలో ఆశను పొందుతారు.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
25 Languages
Pages
6
ఫాతిమా ఈద్ అల్-అధా కోసం ఒంటరిగా ఉంది, మరియు ఆమె ఒంటరితనం ఆమె భరించలేనిదిగా భావించింది. ఆమె ఒంటరితనం అంతా ఆమె తప్పు, ఔను కదా?
అహ్మద్‌ని పెళ్లి చేసుకోడానికి ఫాతిమా తన తండ్రితో ఆమె ఎంత భీకరంగా వాదించిందో గుర్తుచేసుకొనెను. ఆమె యువకురాలు మరియు ప్రేమలో ఉంది. ఆమె తండ్రి వద్దని ఎలా చెప్పగలడు? ఆమె అహ్మద్‌ని పెళ్లి చేసుకోవడానికి పారిపోయినప్పుడు, ఆమె తండ్రి తను ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పెను.
అహ్మద్‌పై ఉన్న ప్రేమను బట్టి ఎట్టి అవమానమునైనా భరించగలనని ఆమె భావించింది. అయితే త్వరలోనే, తన తండ్రే ఒప్పు అని ఆమె ఒప్పుకోవలసి వచ్చింది. తాను ప్రేమలో పడిన అహ్మద్ ఇతడు కాదేమో అని ఆమె కనుగొంది. ఆమెను వదిలేసి మరో మహిళ కోసం వెళ్లిపోయాడతడు.
ఫాతిమా తనను తాను చూసుకుని సిగ్గు పడింది. తనకు న్యాయం జరిగింది మరియు తన లెక్క కట్టుతున్నానని ఆమె నమ్మింది. ఆమె న్యాయాన్ని బాగా అర్థం చేసుకుంది. కానీ ఓహ్, ఆమె హృదయం కనికరం కోసం ఎంతగా ఎదురుచూస్తుంది!
ఎంతో కరుణ మరియు ఎంతో కనికరము
మనం నిజం చెప్పాలంటే, మనందరం తప్పులు చేశాము మరియు జ్ఞానం యొక్క స్వరాన్ని విస్మరించాము. మనము ఇతరులను కించపరచాము. ఇతరులు మనల్ని కించపరిచారు. తప్పులు చేసే వ్యక్తులతోనే మన సమాజం నిండియుంది. మరియు ఒకరినొకరు మరియు మనల్ని మనం క్షమించుకోవడం ఎంత కష్టం!
కనికరము కోసం మనం ఎక్కడ వెతకవచ్చు?
“బిస్మిల్లా అల్-రహ్మాన్ అల్-రహీమ్”—“అత్యంత కనికరముగల, అత్యంత దయగల దేవుని పేరులో”: అనే సాధారణ పదబంధాన్ని మీరు ఎన్నిసార్లు పునరావృతం చేశారో ఆలోచించండి. కనికరమును గూర్చి ప్రత్యేకత ఏమిటి?
బహుశా సంఘాలకు—మరియు మన స్వంత హృదయాలకు—కనికరం చాలా అవసరం కాబట్టి.
కనికరము: శ్రేష్టమైన మార్గము
కొన్నాళ్ల క్రితం అబ్దుల్-రహ్మాన్ అనే వ్యక్తి తన పొరుగింటి కరీమ్‌తో గొడవపడి హత్య చేశాడు. ఈ చిన్న ఈజిప్టు గ్రామంలో రెండు కుటుంబాలకు జీవితం స్తంభించింది. కరీమ్ కుటుంబం ప్రతీకారం వేదికింది, కాగా అబ్దుల్-రహ్మాన్ కుటుంబం అతనిని రక్షించుటకు భయంగా ప్రయత్నించింది. అబ్దుల్-రహ్మాన్ ప్రతీకార చక్రం ఇలాగే కొనసాగరాదని కోరాడు. అతడు సలహ కొరకు గ్రామ నాయకులను అడిగాడు, మరియు వారు మరణ వస్త్రము యొక్క ఆచారము సిఫార్సు చేశారు.
అబ్దుల్-రహమాన్ తన స్వంత తెల్లటి గుడ్డను తెచ్చి దాని పైన కత్తిని ఉంచాడు. గ్రామం మొత్తం చూస్తుండగానే బజారు స్థలములో కరీమ్ కుటుంబాన్ని కలవడానికి అతడు వెళ్ళాడు. అబ్దుల్-రహ్మాన్ బాధితుడు యొక్క సోదరుడు హబీబ్ ముందు మోకరిల్లి, వస్త్రము మరియు కత్తిని అందించాడు. అతడు కనికరము మరియు సయోధ్య కోరాడు.
హబీబ్ కత్తిని అబ్దుల్-రహ్మాన్ మెడపై పెట్టాడు. గ్రామ నాయకులు ఒక గొర్రెను తెచ్చారు, అప్పుడు హబీబ్ తన నిర్ణయం తీసుకోవలసిన సమయం అది: కనికరమా, లేదా పగా? అతను అబ్దుల్-రహ్మాన్ మెడపై కత్తి పెట్టగా, అతని ఈ క్రియ ఇలా ప్రకటించింది: “ఇప్పుడు నీవు నా అధికారంలో ఉన్నావు. ఇక్కడ అన్నీ కళ్ళు దీనిని చూస్తున్నాయి; నిన్ను చంపే హక్కు నాకు ఉందని, అలా చేసే సామర్ధ్యం నాకు ఉందని అందరికీ తెలుసు. కానీ నేను కనికరము మరియు క్షమాపణను ఎంచుకున్నాను. ఇక్కడితో రక్త వైరం అంతము చేస్తాను.”
అతడు అబ్దుల్-రహ్మాన్ నుండి తిరిగి అతనికి బదులుగా గొర్రెను వధించాడు. నొప్పి, కోపం మరియు న్యాయం జంతువుచేత అనుభివించబడినప్పుడు, హబీబ్ అబ్దుల్-రహ్మాన్‌ను కౌగిలించుకొనెను. రెండు కుటుంబాల మధ్య శాంతి పునఃరుద్ధరించబడింది.
కనికరముతో న్యాయాన్ని ఒకటి చేయాలని మానవులు మార్గాలను కనుగొనగలిగితే, దేవుడు ఖచ్చితంగా అదే చేయగలడు!
యేసు ఐన మెస్సీయ: దేవుని నుండి దయ
దేవుని కనికరము గురించి మనమెక్కడ నేర్చుకోవచ్చు? ఇది చాలా సులభం. యేసు ఐన మెస్సీయ (ఇసా అల్-మసీహ్ అని కూడాప్రసిద్ధి) దేవుని నుండి “కనికరము” అని పిలువబడ్డాడని బహుశా మీరు వినియుంటారు. అంటే ఆయన పూర్తిగా కనికరమును కలిగి ఉన్నాడని అర్థం. ఆయన మార్గం—ఇంజీల్ అని కూడా పిలువబడే సువార్తలలో ఆయన బోధనలు—ఇది క్షమాపణ మరియు సమాధానమునకు మార్గం.
మెస్సీయ ఐన యేసు అటువంటి అద్భుతమైన పాత్రను పూర్తి చేయగలడు. ఎందుకంటే ఆయన దేవునిచే పంపినపంపబడ్డ ఏకైక సంపూర్ణ పాపరహితుడు. ప్రతి ప్రవక్త మరియు పవిత్ర బోధకులు వారి తప్పులకు క్షమాపణ అవసరం ఉండెను, కానీ మెస్సీయ ఐన యేసుకు కాదు. ఆయన తీర్పు దినం కోసం ఎదురుచూడకుండా నేరుగా పరలోకమునకు కొనిపోబడ్డాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు—చిన్న తప్పు కూడా.
ఈ కారణము వలన ఆయన దేవుని నుండి దయ అని పిలువబడుచున్నాడు. ఆయన మనకు స్వచ్ఛమైన కనికరమును గూర్చి ఉదాహరణను ఇచ్చాడు మరియు దేవుని యొక్క కృప ఎలా పొందాలో నేర్పాడు.
మెస్సీయ ఐన యేసు నాకు ఎలా సహాయం చేయగలడు?
బాప్టిస్మము ఇచ్చుయోహాను (యాహ్యా అని కూడా ప్రసిద్ధి) యేసు ఐన మెస్సీయను గుంపులో చూసాడని నమోదు చేయబడినది మరియు, దేవుని ప్రేరణతో: “ఇదిగో! లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!” (సువార్తలు, యోహాను 1:29). అని కేకవేసెను. యేసు మెస్సీయ అబ్దుల్-రహ్మాన్‌కు సయోధ్యను సాధ్యం చేసిన గొర్రెపిల్ల లాంటివాడు.
మనము మనతప్పులకు శిక్షించబడితే, ఇది న్యాయము. కానీ పూర్తిగా పాపరహితుడైన యేసు ఐన మెస్సీయ ఆయన మన తప్పులకు బాధ్యత వహించడానికి స్వచ్ఛందంగా వచ్చాడు. ఎవరూ ఆయనను బలవంతం చేయలేదు. న్యాయం గిరాకికి జవాబివ్వడానికి ఆయన ఇష్టపూర్వకంగా మరణాన్ని తన పైకి తీసుకున్నాడు. ఆయన పూర్తి నిర్ధోషిగా జీవించిన ఏకైక వ్యక్తి, అయినప్పటికీ, అబ్దుల్-రహ్మాన్ కథలో గొర్రె వలె తనను చూసుకోవడానికి ఆయన అనుమతించాడు. అందుకే, అతను మన కోసం శ్రమపడ్డ తర్వాత, దేవుడు ఆయనను పరలోకానికి లేపాడు.
బహుశా మీ జీవితంలో మీకు సంఘర్షణ ఉండవచ్చు. బహుశా మీరు ఫాతిమా వలే మీరు ఇష్టపడే వారిచే త్రోసివేయబడి ఉండవచ్చు. బహుశా ఇతరుల చేత మీరు బాధించబడి ఉండవచ్చు లేదా అన్యాయంగా మీ పేరు దెబ్బతినింది. బహుశా మీరు అబ్దుల్-రెహ్మాన్ లాగా, దోషి మరియు ప్రతీకారానికి భయపడ్డారు.
యేసు ఐన మెస్సీయ సహాయం చేయగలడు. మీరు ఇలా ఒక చిన్న విన్నపం ఇలా చేయవచ్చు:
ఓ ప్రభూ, నా పాపాలకు నేను ఎప్పటికీ పరిహారం చెల్లించలేను. కానీ నీవు కనికరముగా యేసు అయిన మెస్సీయను మాకు పంపావుని నాకు తెలుసు. సర్వ మానవాళి కొరకు ఆయన చేసిన త్యాగము వల్ల కావున నా పాపములను క్షమించుము. యేసు అయిన మెస్సీయ మార్గాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయము చేయము, తద్వారా నేను నా జీవితంలో నీ కనికరము అనుభవించగలను. ఆమెన్.
ఈ సువార్తల గూర్చి ఒక కాపీని పొందాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్ములను సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications