
దురాత్మల నుండి భద్రత
Summary
దురాత్మ లు శక్తివంతమైనవి, కానీ యేసు ప్రభువు అంత శక్తివంతమైనవి కావు. యేసు దయ్యాలను బాధిస్తున్న వ్యక్తుల నుండి ఎలా వెళ్లగొట్టాడో మరియు వారికి స్వస్థతను కనుగొనడంలో ఎలా సహాయపడ్డాడో ఈ కరపత్రం వివరిస్తుంది. ఆయన ఈరోజు మనకు కూడా అలాగే చేయగలడు. ఆయన గ్రంధం దెయ్యాల వేధింపులు మరియు అణచివేత నుండి విముక్తి పొందేందుకు మనం తెలుసుకోవలసిన ప్రతిదాన్ని బోధిస్తుంది. ఆయన తిరిగి రాకముందే దెయ్యాల మోసగాళ్లచే మోసపోకుండా ఎలా ఉండవచ్చో కూడా ఇది మనకు బోధిస్తుంది.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
25 Languages
Pages
6
భూతములు ప్రతిచోటా ఉంటాయి. వాటిని దురాత్మ, దెయ్యాలు, భూతములు లేదా జినులు అని పిలిచినా, యివి భయకరములే. క్షుద్రశక్తులు, మంత్రగత్తెలు మరియు చిల్లంగివారు ప్రసిద్ధి చెందారు, అయితే వారు నిజంగా మనలను కాపాడగలవా?
మీరు భయపడాల్సిన అవసరం లేకుండా దుష్టశక్తుల నుండి రక్షణకు నేను మూడు సాధారణ దశలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
దురాత్మల నుండి రక్షణ
ఒక వ్యక్తి నగ్నంగా తిరుగుచు కేకలు పెట్టుచున్నాడు. అతడు ఆనేక జినులు (దెయ్యాలు) చేత ఆవహించట్టబడియున్నాడు కావున అతనికి ఎవరూ సహాయం చేయలేకున్నారు. గ్రామంలోని ప్రజలు అతనిని గొలుసులతో బంధించడానికి ప్రయత్నించారు, కానీ అతను మానవాతీత శక్తితో వాటిని తెంచి తర్వాత సమాధుల మధ్య నివసించడానికి పారిపోయాడు. దయనీయంగా ఏడుస్తూ, రాళ్లతో గాయపరుచుకుంటు అలాగే రోజులు గడిపాడు.
ఇసా అల్-మసీహ్ అని కూడా పిలువబడే యేసు క్రీస్తు అనే వ్యక్తి రాక వచ్చే వరకు.
ఆ వ్యక్తి యెంత వశీకరణం చెందాడు అనగా, సహాయం కోసం అతను నోరు తెరిచినప్పుడు, జిన్ తనను ఒంటరిగా వదలమని యేసుక్రీస్తు యెడల అరిచాడు. కానీ యేసు విడిచిపెట్టలేదు. ఏం జరుగుతూ ఉండెనో అతనికి తెలిసెను. భయపడకుండా, ఆయన ఆ వ్యక్తిని విడిచిపెట్టమని జిన్‌ను ఆజ్ఞాపించాడు.
“మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దని!” దెయ్యాలు వేడుకున్నారు. సమీపంలో ఉన్న పందుల మందలోకి పంపమని అవి వేడుకున్నాయి. ఆ మనిషిని విడిచిపెట్టి అపవిత్రమైన జంతువులలోనికి వెళ్లమని యేసు వాటిని ఆజ్ఞాపించెను. అంతట, ఆ మనిషికి తెలివి వచ్చింది, మరియు పందుల మంద మొత్తం పరిగెత్తుకుంటు కొండపై నుండి సముద్రంలోకి దూకెను.
చివరకు, అతడు స్వేచ్ఛగా ఉన్నాడు. అతను కృతజ్ఞత తెలిపినాడు! అయితే ఇది ఒక్కటే కథ కాదు. దుష్టాత్మలపై యేసుక్రీస్తుకు అనంత శక్తి ఉండెను. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆయన దుష్టాత్మల బారిన పడిన ప్రజలను విడిపించాడు. ఆయన తన అనుచరులకు దురాత్మలపై అధికారాన్ని కూడా ఇచ్చాడు:
ఇదిగో, మీకు అధికారము అనుగ్రహించియున్నాను... శత్రువు బలమంతటిమీదను మీకు; మరియు ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. (ఇంజీల్ అని కూడా పిలువబడే సువార్తల నుండి లూకా 10:19-20).
మనం యేసుక్రీస్తును అనుసరించినప్పుడు, ఈ జీవితంలో మనకు భద్రత మరియు రాబోయే జీవితానికి భరోసా ఉంటుంది! దుష్టశక్తుల నుండి విముక్తిని పొందడానికి మూడు దశలను చూద్దాం.
1వ దశ: యేసు క్రీస్తు నామము యొక్క మహా శక్తిని ఆరోపించెదము
యేసుక్రీస్తు నామంలో దేవుని రక్షణ వెతకడం మొదటి మెట్టు. స్వతహాగా మనం శక్తిహీనులం. అయితే మన జీవితాలు యేసుక్రీస్తు నామములో నిలుచున్నాయని ప్రకటించినప్పుడు, శక్తిహీనులవుతాయి! యేసు తన శిష్యులను గురించి ఇలా అన్నాడు: “నా నామమున వారు దయ్యములను వెళ్లగొట్టుదురు” (సువార్తలు, మార్కు 16:17).
యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించగలరని మీరు మీ హృదయ పూర్వకంగా విశ్వసిస్తే, ఆయన దానిని చేస్తాడు! కేవలం దేవునికి ఈ ప్రార్థన చేయండి: “ప్రభువా, నీవు పంపిన యేసుక్రీస్తు నామమున దురాత్మల నుండి నన్ను విడిపించుము!”
2వ దశ: ఆంతర్యము మరియు బాహ్య ప్రక్షాళన కోసం వెతకండి
మనం దెయ్యమునకు అధికారమనే అవకాశం ఇవ్వరాదని యేసుక్రీస్తు బోధించెను. ఆయన చెప్పెను: “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు” (సువార్తలు, యోహాను 14:30). అన్ని చెడు ప్రభావాల నుండి మన జీవితాలను కూడా శుభ్రపరచుకోవాలి.
దెయ్యానికి “మనలో ఏమీ లేదు” అంటే ఏమిటి? అంటే మన హృదయాలలో లేదా గృహాలలో అతనికి చెందినదేమీ లేదు. మూఢనమ్మక మంత్రాలను మరియు తాయెత్తులను మనం పారవేయాలి. అశ్లీలత, మాదకద్రవ్యాలు మరియు మద్యం వంటి పాపపు దుర్గుణాలకు మనం దూరంగా ఉండాలి. చనిపోయిన వారితోను మరియు పిశాచులతోను మాట్లాడటం లేదా శాపనార్థాలు పెట్టడం వంటి ఆచారాలలో మనం నిమగ్నమై ఉన్నట్లయితే, మనం వెంటనే ఈ కార్యకలాపాలను ఆపాలి. ఆ విధంగా, మనం మన బాహ్య వాతావరణాన్ని దెయ్యాల ప్రభావాల నుండి శుభ్రం చేస్తాము. అప్పుడు, మనల్ని క్షమించమని మరియు అంతరంగము శుభ్రపరచమని మనం దేవునికి ప్రార్థించాలి.
3వ దశ: మీ జీవితాన్ని వెలుగుతో నింపండి
యేసుక్రీస్తు మిమ్మల్ని దుష్టాత్మల శక్తి నుండి విడిపించిన తర్వాత, మీ జీవితానికి బాధ్యత వహించమని ఆయనను ఆహ్వానించండి. మీ హృదయాన్ని ఖాళీగా ఉంచవద్దు. యేసు క్రీస్తు ఇలా చెప్పెను:
అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున: “నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదును.”అనుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక, అది ఊడ్చి, అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును (సువార్తలు, మత్తయి 12:43-45).
మీరు జిన్ నుండి శుద్ధి చేయబడినప్పుడు, మీ జీవితాన్ని యేసు పుస్తకమైన బైబిల్ వెలుగుతో నింపుకోండి. యేసుక్రీస్తు “ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాడు, [ఆయన] యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండడు” (సువార్తలు, యోహాను 12:46). యేసును గూర్చిన గ్రంథం వకటి పొందండి మరియు ప్రతిరోజూ చదవండి, తద్వారా ఆయన వెలుగు చీకటిని పారద్రోలుతుంది.
భవిష్యత్తు కోసం భద్రత
దుష్టశక్తులు గతంలో కంటే మరింత చురుకుగా తిరుగుతున్నటువంటి అంతిమ కాలం సమీపముగా జీవిస్తున్నాము. యేసుక్రీస్తు తాను తిరిగి రాకముందే, విశ్వాసులను మోసగించడానికి దుష్ట శక్తులు అనేక అద్భుతాలు చేస్తాయని చెప్పెను. కొందరికి, జినులు దెయ్యాలుగా భయంకరమైన రూపాల్లో కనిపిస్తారు; ఇతరులకు, వారు దేవదూతలుగా లేదా చనిపోయిన బంధువులుగా కనిపిస్తారు. దెయ్యము స్వయంగా యేసుక్రీస్తు వలె వేషము వేయనైయున్నాడు!
అయితే మీరు అబద్ధాల ద్వారా మోసపోవలసిన అవసరం లేదు. మీరు యేసుక్రీస్తును అనుసరిస్తే, దుష్టుడైన సాతానును ఎదిరించే శక్తిని ఆయన మీకు ఇస్తాడు. ప్రియమైన మిత్రమా, ఈ రోజు నీ పోరాటం ఏమైనా, యేసుక్రీస్తు నిన్ను విడిపించనివ్వండి!
దుష్టాత్మల నుండి మీ విమోచన కొరకు యేసు క్రీస్తు అనుచరుడు ప్రార్థించాలని మీరు కోరుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం వద్ద మమ్మల్ని సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications