
తీర్పులో నిర్భయము
Summary
తీర్పు రోజు గురించి ఆలోచిస్తే చాలా మంది హృదయాల్లో భయం వేస్తుంది. ఆ చివరి రోజు లెక్కింపులో మనం సురక్షితంగా వెళతామని ఎలా నిశ్చయించుకోవచ్చు? ఎవరైనా ఒక న్యాయవాది భూసంబంధమైన కోర్టులో మన కేసును వాదించే విధంగా తీర్పులో మన కోసం మధ్యవర్తిత్వం వహించడానికి - దేవుడు మనకు ఒక న్యాయవాదిని ఇస్తానని చెప్పాడు. ఈ కరపత్రం మనకు ఈ న్యాయవాదిని పరిచయం చేస్తుంది మరియు రాబోయే తీర్పు గురించి మనం ఆలోచిస్తుండగా ఎలా భరోసా పొందాలో నేర్పుతుంది.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
25 Languages
Pages
6
ఒక రోజు ఉదయం, నేను ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావడానికి నా హోటల్ గది విడిచాను. నేను ఆలస్యమయ్యాను కాబట్టి నేను వేగంగా నడిపాను—వేగ పరిమితి కంటే వేగంగా నడిపాను. నా గమ్యస్థానానికి సగం దారిలో, ఒక పోలీసు అధికారి నన్ను లాగాడు మరియు నేను తప్పక పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని చెప్పాడు! నేను తప్పు చేసానని నాకు తెలుసు కాబట్టి నేను భయముగా మరియు చాలా నిస్సహాయంగా భావించాను.
పోలీసు అధికారి నాపై వ్యాజ్యం మోపిన తర్వాత, నన్ను పిలుపు కోసం సమీప న్యాయస్థానానికి తీసుకెళ్లబడ్డాను. అక్కడ న్యాయవాదిగా పనిచేసే స్నేహితుడిని కలవడం జరిగింది. అతను నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నేను నా పరిస్థితిని వివరించాను, అతడు: “చింతించకు. నీ వ్యాజ్యంను నేను తీసుకుంటాను.” నేను చాలా సంతోషించాను. నా స్వంత స్నేహితుడు నా న్యాయవాది!
నా తరపున వాదించడానికి నా స్నేహితుడు ముందుకొచ్చాడు కనుక న్యాయమూర్తి కనీస జరిమానా విధించాడు. దేవుడిని స్తుతిస్తూ న్యాయస్థానం విడిచాను.
భూసంబంధమైన న్యాయాధిపతి ముందు నిలబడడం నిజంగా భయంకరమైనది. కాని లెక్క అప్పగించవలసిన తీర్పు దినముతో దేవుని ముందు నిలబడటం ఎలా ఉంటుందో పోలిస్తే ఇది ఏమీ కాదు. ఆ రోజు రేపు వస్తే, మీరు సిద్ధంగా ఉన్నారా?
తీర్పు కోసం సిద్ధపడుట
రాబోవుచున్న తీర్పు యెడల కొందరు వక సాధారణ వైఖరితో స్పందిస్తున్నారు. వారు మద్యం, పొగ త్రాగుతారు, జూదం ఆడతారు, రాత్రి వినోద శాలలకు వెళతారు మరియు చెడు వీడియోలు చూస్తారు. ఈ విషయాలు జ్ఞాపకార్థ గ్రందములో వ్రాయబడతాయని వారికి తెలిసి ఉండవచ్చు, కానీ వారు సాతాను (షైతాన్ అని కూడా పిలుస్తారు) యొక్క భ్రమలచేత చిక్కుబడుతున్నారు. వారు పట్టించుకోరు.
అయితే ఇతర వ్యక్తులు అధిక భయంతో స్పందిస్తారు. వారు ఒక్క ప్రార్థననైన కోల్పోయే ధైర్యం వహించరు. దేవుని ప్రేమ మరియు దయను మరచిపోయేంతగా వారు సమాధి యొక్క హింస లేదా నరకాగ్ని గురించి ఎంతగానో ఆలోచిస్తారు.
అయితే న్యాయస్థానంలో నాకు ఒక న్యాయవాది ఉన్నట్లే, తీర్పు గుండా దాటడానికి మనకు సహాయం చేసే న్యాయవాదిని దేవుడే చేకూర్చాడు. మీరు ఒంటరిగా ఉండనవసరం లేదు!
మన న్యాయవాది ఎవరు?
న్యాయవాది అనే భావన కొత్తది కాదు. ప్రతి సంవత్సరం, వేలాది మంది యాత్రికులు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం మరియు ఆసియాలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చాలా మంది జనులు గొప్ప నాయకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తారు, కావున వారి తరపున వారు వాదిస్తారని నమ్ముతూ.
ఆ గొప్ప నాయకులను గౌరవించడం మంచిది, కానీ వారికి ప్రార్థించడం లేదా వారి మధ్యవర్తిత్వం కోరడం పూర్తిగా హాని (హరామ్). వారు చనిపోయారు మరియు నీ కోసం ఏమీ చేయలేరు. ప్రవక్తలు కూడా తమ సమాధులలో పునరుత్థాన దినం కోసం ఎదురుచూస్తున్నారు.
చనిపోయినవారిని మన కోసం విజ్ఞాపన చేయమని కోరడం హరామ్ అయినప్పటికీ, మధ్యవర్తిత్వం అనే భావన ఆలోచన సరైనదే. అయితే దేవునికి ఎవరి మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యం? అతడు ఉండాలి
సజీవుడు (మృతులు మన తరపున మాట్లాడలేరు కాబట్టి).
పాపరహితుడు (ఎందుకంటే చట్టంచే ఖండించబడిన వ్యక్తి ఇతరుల కోసం వాదించలేడు) అయి ఉండాలి.
ఈ అర్హతలను ఎవరు నెరవేర్చగలరు? పరలోకంలో సజీవంగా మరియు పూర్తిగా పరిపూర్ణంగా ఉన్న ఇసా అల్-మసీహ్, అని కూడా పిలువబడే ప్రియమైన యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు.
దాని గురించి ఆలోచించండి—పాపరహితమని చెప్పగల ఇంకెవరైనా ఉన్నారా? ఆదాము నిషేధించబడిన ఫలము తిన్నాడు; నోవాహు (నుహ్) ద్రాక్ష రసముతో మత్తుడైనాడు; అబ్రహం (ఇబ్రహీం) అబద్ధం చెప్పాడు; మోషే (మూసా) ఒక వ్యక్తిని హత్య చేశాడు; దావీదు (దావూద్) మరొక వ్యక్తి భార్యను అపహరించాడు. ఒక్క తప్పు కూడా చేయని లేదా క్షమాపణ అడగని ఒక్క ప్రవక్త కూడా మీరు కనుగొనరు.
కానీ యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. ఆయనే స్వయంగా పేర్కొన్నాడు: “నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను” (సువార్తల నుండి, ఇంజీల్ అని కూడా పిలుస్తారు, యోహాను 8:29).
శాంతంతో తీర్పును ఎదుర్కొనుట
యేసుక్రీస్తు పరలోకంలో సజీవంగా ఉన్నాడు మరియు పూర్తిగా పాపరహితుడు. ఆయన నాకు మరియు నీకు వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు ఆయన త్వరలో తిరిగొస్తాడు.
ఆయన రెండవసారి తిరిగి వస్తున్నట్లయితే, యేసుక్రీస్తు చివరి ప్రవక్త అని అర్థం. అవును, మరియు ప్రవక్త కన్నా మిన్నగా—తీర్పు దినమందు ఆయన మన న్యాయవాది, మాస్టర్ మరియు శాంతి. ఆయన మాకు చెప్పాడు, “ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా... చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను” (సువార్తలు, యోహాను 8:51).
యేసు సమాధి ఖాళీగా ఉంది. ఆయన జీవించి ఉన్నాడు! ఆయన ఇప్పటికి కూడా భూమిపై తన సమాజాన్ని నిర్మిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన తెలుపు రంగులో ఉన్న వ్యక్తిగా కలలో కనిపించడం ద్వారా లేదా ఆయన పేరున దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనకు అద్భుతాలు ఇవ్వడంచేత ప్రజలను తన సంఘంలోకి ఆహ్వానిస్తాడు.
ఆ తీర్పుదినమున మీరు శాంతిని పొందాలనుకుంటున్నారా? యేసు క్రీస్తులో మీ నమ్మకాన్ని ఒప్పుకోండి. మృత్యులపై మరియు తీర్పు దినమున ఎలా ఉంటారో తెలియని వారిపై మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసు పరలోకంలో తన స్థానం యెడల ఖచ్చితంగా ఉన్నాడు. న్యాయస్థానంలో న్యాయవాది అయిన నా స్నేహితుడు వలే, ఆయన మనకు సహాయం చేయనై ఉన్నాడు.
ఇంత అద్భుతమైనది నిజమేనా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. యేసు క్రీస్తు చెప్పాడు, “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” (సువార్తలు, యోహాను 14:14). నేను మీకు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టండి. యేసు ప్రస్తుతం జీవితంలోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేంత శక్తివంతంగా ఉంటే, ఆయనను ఖచ్చితంగా మన న్యాయవాదిగా విశ్వసించబడవచ్చు. హృదయపూర్వకంగా యేసు నామంలో దేవునికి ప్రార్థించండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. మీరు ప్రార్థన చేయవచ్చు:
ఓ ప్రభూవా, తీర్పులో నీవు నియమించిన యేసేనా నిజముగా మా న్యాయవాది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది నిజమైతే, దయచేసి నా ప్రార్థనకు జవాబివ్వు (మీ అవసరాన్ని ఇక్కడ చేర్చండి). నేను యేసుక్రీస్తు నామంలో దీనిని అడుగుతున్నాను. ఆమెన్.
మీరు యేసు క్రీస్తును ఎలా అనుసరించాలి అనేదాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications