వలసకు ఆహ్వానం

వలసకు ఆహ్వానం

Summary

మీరు ఒక మంచి ప్రదేశం కోసం ఎదురు చూస్తున్నారా? భద్రత, ఆనందం మరియు విశ్రాంతి స్థలం? మనలో ప్రతి ఒక్కరు పరదీసు కోసం సృష్టించబడినందున ఈ ప్రపంచం అందించలేని దాని కోసం మనం ఎదురుచూస్తున్నాము. యేసు ఐన మన రక్షకుడు అప్పటికే అక్కడికి వెళ్ళాడు. ఆయనకు మార్గం తెలుసు, నిజానికి ఆయన తనను తాను 'మార్గం' అని పిలుస్తాడు! ఈ కరపత్రం యేసు ప్రభువు గురించిన ముఖ్యమైన సత్యాలను వివరిస్తుంది, అది పరదైసులో పౌరసత్వం కోసం మనలను సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది.

Download

అబ్దుల్-మాలెక్ ఒక అలసిన వృద్ధుడు. తన భార్య మరియు పిల్లలు కోల్పోయిన తరువాత, అతను ఐఎస్ఐఎస్ నుండి తప్పించుకోవడానికి ఇరాక్ పారిపోయాడు. ఇప్పుడు అతను శరణాగతుడుగా జోర్డాన్‌లో ఒంటరిగా నివసించాడు.

కానీ నిరీక్షణ మెరుపు . అతనికి కెనడాలో నివసిస్తున్న ఒక బంధువు ఉన్నాడు, అతను అతనికి ఉపాధిని పొందడంలో సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. పరవశించి, వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు మరియు సులభమైన జీవితం గురించి కలలు కనెను. చివరగా, చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత, అతనికి కెనడాకి ప్రవేశం లభించింది. అబ్దుల్-మాలెక్ ఆనందానికి లోనైయ్యెను!

కానీ అతని ఆనందం స్వల్ప-కాలికం అయింది. కెనడాకు చేరుకున్న తర్వాత, వలస అనుమతి పొందిన జీవితం సులభం కాదని అతను కనుగొన్నాడు. అతని పని అతనిని రోజంతా అతని కాళ్ళ మీద ఉంచింది. అతని పొరుగువారు బిగ్గరగా ఉండెను. ప్రజా రవాణాను మరియు ఇంగ్లీషు భాషను అర్థం చేసుకోవడం కష్టం! 

అబ్దుల్-మాలెక్ ఎప్పుడూ మంచి ప్రదేశానికి వెళ్లాలని కల కన్నాడు, కానీ అతను వచ్చిన తర్వాత, అతని గుండె ఇంకా నొప్పిగా ఉంది. తాను ఆశించిన కోరిక భూమిపై ఏ దేశముచేనైనా నెరవేరుతుందా లేదా పరదైసు చేరే వరకు వేచి ఉండాలా అని అతడు ఆలోచించడం ప్రారంభించాడు!

పరదైసుకు వలస

మీరు అబ్దుల్-మాలెక్ లాగా ఎప్పుడైన ఆలోచించారా? మంచి ప్రదేశమునకు వెళ్లాలనే కోరిక ప్రతి మానవుని హృదయంలో నాటుకుపోయింది మరియు మన నిజ నివాసమైన పరదైసులో ప్రవేశించడం చేత మాత్రమే నెరవేరుతుంది. మరియు అది త్వరలో నెరవేరబోయే కోరిక! ఘడియ యొక్క సంకేతాలు మన కళ్ల ముందు జరుగుతున్నాయి మరియు ఈ ప్రపంచం త్వరగా ముగింపుకొస్తూ ఉంది.

అంతిమ ద్వార ప్రవేశ సన్నివేశమునందు—మనము ఈ లోకము నుండి తదుపరి లోకానికి “వలస” వెళ్ళినప్పుడు ప్పుడు చివరి మార్పులు జరుగుట, అంత్య దినములు గూర్చి శతాబ్దాలుగా, యూదుల, క్రైస్తవుల మరియు ముస్లింల మత పుస్తకాలు యుగాంతమును గూర్చి ప్రవచించాయి. మూడు విశ్వాసాలు చివరి సంఘటనల పరాకాష్టకు బాధ్యత వహించే మెస్సీయ-మూర్తిని సూచిస్తాయి. 

ఆసక్తికరంగా, క్రైస్తవ్యం మరియు ఇస్లాం మతంలో ఈ మెస్సీయ—అను వ్యక్తిమరెవరో కాదు, ఇసా అల్-మసీహ్ అని కూడా అని ప్రసిద్ధి గాంచిన యేసుక్రీస్తు. ఆయన పాలస్తీనాలో నివసించినప్పుడు ఆయన మెస్సీయ, కానీ గత 2,000 సంవత్సరాలుగా ఆయన పరదైసులో నివసిస్తున్నాడు. ఆయన చివరికి అంతిమ తీర్పు దినమందు తిరిగి వస్తాడు. 

యేసుక్రీస్తు యొక్క పునరాగమనం బైబిల్‌లో ప్రముఖంగా ప్రస్తావించబడింది, అయితే ముస్లింలు కూడా ఆయన మళ్లీ వస్తాడని నమ్ముతారు, ఎందుకంటే ఇది ఖురాన్‌లో వ్రాయబడింది: “మరియు (యేసు) (రాకడకు) ఆ ఘడియ ఒక సంకేతం (తీర్పు): కాబట్టి (ఘడియ) గురించి ఎటువంటి సందేహం వలదు, కానీ మీరు నన్ను అనుసరించండి: ఇది సరళమైన మార్గం” (అజ్-జుఖ్రుఫ్ 43:61).

వలస అధికారి వీసా ఎలా పొందాలో ముఖ్యమైన మార్గనిర్దేశం ఇచ్చుచున్నట్లే, యేసు క్రీస్తు మనకు పరదైసుకు తిన్నని మార్గం తెలియునట్లు ఆయన చెప్పిన సూచనలు యెడల శ్రద్ధ వహించమని మనలను ఆహ్వానిస్తున్నాడు. 

పరదైసు ఎలా ఉంటుందని యేసు చెప్పాడు?

ఇంజీల్ అని కూడాప్రసిద్ధి గాంచిన సువార్తలలో, యేసు క్రీస్తు ఇలా చెప్పాడు, “మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” (సువార్తలు, యోహాను 14:2-3). యేసుక్రీస్తు మనలను పరదైసు తీసుకెళ్లగలడని చెప్పాడు! 

ఆయన ఆ స్థలము యొక్క కొన్ని సుందరమైన విషయాలు కూడా బయలుపరిచెను. ఆయన చెప్పినది ఏమిటంటే

  • ఇక్కడ మరణము, దుఃఖము, ఏడుపు లేదా బాధ ఉండదు (ప్రకటన 21:4).

  • మనకు అందమైన గృహాలు ఉంటాయి (యోహాను 14:2).

  • పురుషులు మరియు స్త్రీలు సమాన గౌరవం మరియు హక్కులు ఉంటారు (గలతీ 3:28).

  • ఇది పూర్తి మహిమ, నీతి మరియు ఆనందంతో నిండి ఉంది (ప్రకటన 21:21-25).

నిజంగా, ఇది మన హృదయాలు కోరుకునే ప్రదేశం! 

యేసు క్రీస్తు రెండవసారి ఎందుకు వస్తాడు?

కానీ దేవుడు చాలా మంది ప్రవక్తలను మరియు పవిత్రులైన రాయబారులను పంపెను. యేసుక్రీస్తు రెండవసారి తిరిగి రావడానికి ఎందుకు ఎంపిక చేయబడ్డాడు? ఈ ప్రశ్నకు దేశాంతరము వెళ్ళినా అదే ఉదహరణతో సమాధానం ఇవ్వడం సులభం. వీసా పొందడం సులభం కాదు కాబట్టి, చాలా మంది వ్యక్తులు మార్గం తెలిసిన వలస న్యాయవాదిని నియమించుకుంటారు. మనకు మార్గదర్శకుడు ఉంటే, అతడుమనకు సహాయం చేస్తాడని నమ్మవచ్చు.

అదేవిధంగా, యేసుక్రీస్తు మాత్రమే రెండవసారి తిరిగి ప్రత్యక్ష మౌతాడు, ఎందుకంటే ఆయనకు పరదైసుకు మార్గం తెలుసు మరియు మనలను అక్కడికి నడిపించగలడు. యేసు స్వయంగా చెప్పాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును” (యోహాను 14:6).

దేవుడు పంపిన ప్రతి ప్రవక్త మరియు దూత తప్పులు చేసినవారే మరియు వారు క్షమాపణ కోరవలసి వచ్చింది. కానీ యేసు క్రీస్తు కాదు. ఆయన భూమిపై జీవించిన 33 సంవత్సరాలలో పాపరహితుడు. అందుకే ఆయన వెంటనే పరదైసుకు కొనిపోబడ్డాడు. 

పరదైసు ప్రవేశ అవసరాలను ఎలా తీర్చాలో పాపరహితుడైన మన యేసుక్రీస్తు నుండి మనము నేర్చుకోవాలి. ఈ విధంలో మాత్రమే మనము ప్రవేశం యొక్క పూర్తిగా సానుకూలత గలిగి ఉండగలము. కృతజ్ఞతగా, ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నుండి మనం నేర్చుకోవచ్చు. 

యేసు క్రీస్తు పునరాగమనం కోసం సిద్ధమౌట

మెరుగైన ప్రదేశానికి మీ వలస గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగడం ఉత్తేజకరమైనది కాదా? పరదైసులో ఉన్న దేవుని మహిమాన్వితమైన రాజ్యంలో పౌరునిగా మారేందుకు మీరు ఆహ్వానించబడి ఉన్నారు! మనందరినీ ఆ సుందరమైన రాజ్యమునకు తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు త్వరలో రానైయున్నాడు.

ఆ తీర్పు దినాన తమకు ఏమి జరుగనైయుందో తెలియని మనుషులను మీరు అనుసరిస్తున్నారా? యేసు క్రీస్తుతో, మీరు సందేహించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క తిన్నని మార్గంలో మిమ్మల్ని నడిపించమని దేవుణ్ణి అడగండి. మీరు ఇలా విజ్ఞాపన చేయవచ్చు:

ఓ ప్రభువ, నా హృదయం శ్రేష్ఠమైన ప్రదేశం కోసం ఎదురుచుస్తున్నది. దయచేసి నన్ను మరియు నా ప్రియమైన వారిని ఈ ప్రపంచంలోని కష్టాల నుండి విముక్తి చేయండి. సమయం తక్కువగా ఉందని నమ్ముతున్నాను. నీవు నా కోసం సిద్ధం చేసిన అద్భుతమైన ప్రదేశంలోకి నేను ప్రవేశించునట్లు, దయచేసి నాకు మార్గము నిర్దేశించుము. ఆమెన్.

మీరు సువార్తల యొక్క ప్రామాణికమైన ప్రతిని పొందాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

డా. అబ్దుల్-రహీం మహమ్మద్ మౌలానాచే ఖురాన్ యొక్క తెలుగు అనువాదం.Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనాల కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover