
నా నొప్పికి న్యాయం
Summary
బాధ శాశ్వతంగా ఉండదు. ఈ కరపత్రం పోరాడుతున్నఓ అత్యాచార బాధితురాలి గురించి మాట్లాడుతుంది, సృష్టికర్త దేవుడు దుష్టులపైకి తీసుకురాబోయే తుది న్యాయం గురించి ఆలోచిస్తుంది ఆమె. యేసు వేషధార నాయకులను ఎలా ఖండించాడో మరియు బాధపడ్డ వారికి అనుకూలంగా తీర్పును ఎలా వాగ్దానం చేశాడో వివరిస్తుంది అది. కానీ మనము తప్పు చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం అనుభవించిన బాధల ద్వారా మనం క్షమించబడగల మార్గం కూడా ఉంది.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
11 Languages
Pages
6
విమల గుండెలు బాదుకుంటూ నేరుగా మంచం మీద కూర్చుంది. మరో పీడకల! ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఆమెను పాడుచేసిన వ్యక్తి జ్ఞాపకాలు—ప్రతి కొన్ని రోజులకు, భయంకరమైన జ్ఞాపకాలు ఆమె కలలలోకి ప్రవేశించెను.
విమల ఆ రోజు మరువపోలేకపోయింది. ఆమె సిగ్గుగా మరియు మురికిగా అనిపించింది మరియు ఆమె మోస్తున్న నొప్పి బరువు గురించి ఎవరికీ చెప్పలేదు. విమల విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించింది, కానీ పీడకలలు ఆమెను అనుసరిస్తూనే ఉండెను. ఆమె ఆ వ్యక్తిని అసహ్యించుకుంది మరియు అతను అర్హమైనది పొందాలని ఆశించింది.
క్లిష్టమైన ప్రశ్నలు
విమల మనసు ప్రశ్నలతో కలత చెందింది. ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తికి కర్మ ద్వారా న్యాయం జరుగుతుందా? అతను ఆమె నగరానికి చెందిన ప్రసిద్ధ పవిత్ర వ్యక్తి. అతను ప్రజలకు చాలా మంచి పనులు చేసాడు, తరచుగా ఉపవాసం ఉన్నాడు మరియు దేవతల యెడల గొప్ప భక్తిని చూపాడు. అతని అన్ని మంచి పనులతో పోల్చినప్పుడు ఒక చెడు పని తేడాను కలిగిస్తుందా? కర్మ యొక్క నియమాలు ఎలా పనిచేస్తాయో ఆమెకు తెలుసు, కానీ అతని చెడు ఆమెకు తేడాను తెచ్చింది. విమల తన బాధను మరువలేకుంది.
న్యాయాన్ని కనుగొనడం
విమల క్లాస్‌మేట్స్‌లో, ఒకరైన సైరాకు, ఆపదలో ఉన్న మహిళలకు సహాయం చేసే సంస్థలో ఇంటర్న్‌షిప్ ఉండెను. ఒక రోజు, సైరా వితంతువులు, హింసించబడిన మహిళలు మరియు అత్యాచార బాధితులకు సహాయం చేసే కేంద్రాన్ని సందర్శించడానికి డౌన్‌టౌన్‌కు రమ్మని ఆమెను ఆహ్వానించెను. ఆమెకున్న భయంకరమైన రహస్యం ఎవరికైనా తెలిసింది అని విమల కంగారు పడింది. కానీ విమల వెళ్లాలని నిర్ణయించుకునేంతగా సైరా చాలా దయగా అనిపించింది. వాళ్ళు వెళ్తుండగా సైరా గత కొన్ని రోజులుగా తాము చూసిన గాయపడిన కొంతమంది స్త్రీల గురించి చెప్పింది.
“గురువుల వేధింపులకు గురైన స్త్రీలను మీరు ఎప్పుడైనా చూశారా?” సిగ్గుపడుతూ అడిగింది విమల.
“అవును, కొన్నిసార్లు,” సైరా బదులిచ్చింది. “అదీ చాలా విచారం. ఎవరైనా మతస్థుడని చెప్పుకున్నంత మాత్రాన అతడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడని కాదు.”
“అది నిజం...”
“నా గురువైన మహాగురువు, మన రోజుల్లో మత ప్రపంచం చాలా భ్రష్టుపడనైయుందని ప్రవచించెను. మనం అవినీతి మతం నుండి బయటపడాలి మరియు సృష్టికర్త అయిన దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఆయన మనకు స్వచ్ఛమైన హృదయాలను ఇవ్వబోవును మరియు మన చెడ్డ పనులను క్షమించబోవును. అప్పుడు దేవుడు ఈ గ్రహాన్ని మళ్లీ దుష్టులు లేని పరిపూర్ణలోకముగా తిరిగి సృష్టిస్తాడని ఎదురు చూచివారిలో మనం కూడా ఉంటాం.”
“ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీ గురువు ఎవరు?”
“నేను ప్రభువైన యేసుక్రీస్తును అనుసరిస్తా ను. ఆయన గొప్ప గురువు, కానీ, ఆయన దివ్యావతారి కూడా. ఆయన గురించి నీకు తెలుసా?”
“నేను ఆయన చిత్రాలను మార్కెట్‌లో చూశాననుకుంట, కానీ ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఇంకా ఆయన ఏం చెప్పాడు?”
బస్సు కాలిబాట వరకు వచ్చి ఆగింది. “లోపలికి వెళ్దాం,” సైరా అన్నది, “నేను మీకు మరింత చెబుతాను.”
ఆధ్యాత్మిక వేషధారణ
విమల, సైరా బస్సు ఎక్కి స్థలము చూసుకున్నారు మరియు కూర్చున్నారు.
మతపరమైన కపటత్వం యొక్క హానికరమైన ప్రభావాల గురించి యేసు చాలా మాట్లాడాడు,“ సైరా అంది. ఆమె పర్సులోంచి యేసుప్రభువుకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని తీసి తెరిచింది. “చూడు ఇక్కడ ఏమి చెబుతుందో,” ఆమె సూచించింది. విమల చదివింది:
అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మరియు వేషధారులారా! మీకు శ్రమ. మీరు విధవరాండ్ల ఇళ్లను మ్రింగివేస్తారు, మరియు నెపం కోసం దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. కాబట్టి మీరు గొప్ప శిక్షను పొందుతారు. (బైబిలు, మత్తయి 23:14).
“శాస్త్రులు మరియు పరిసయ్యులు ఎవరు?” ఆమె అడిగింది.
“యేసుప్రభువు కాలంలో వారు ఒకరకంగా గురువులుగా ఉండేవారు, కానీ వారు చాలా అవినీతిపరులు” అని సైరా వివరించింది. విమల తల ఊపుతూ చదువుతూనే ఉంది.
అయ్యో, శాస్త్రులారా, పరిసయ్యులారా మరియు వేషధారులారా! మీకు శ్రమ మీరు గిన్నెయు మరియు పళ్లెమును వెలుపల శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపిడీ తోను మరియు అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. (బైబిలు, మత్తయి 23:25-26).
శాశ్వతమైన తీర్పు
“ఆధ్యాత్మిక కపటము నేటికీ మనలో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సృష్టికర్త దేవుడు చెప్పెను” సైరా అంది. “మన రోజుల్లో ప్రపంచం మరియు మత వ్యవస్థలు కూడా చాలా భ్రష్టుపట్టిపోతాయని యేసు ప్రభువు గ్రంథం (బైబిలు) చెబుతోంది. అయితే దేవుడు ప్రపంచాన్ని తిరిగి-సృష్టించినప్పుడు దుర్మార్గులకు తీర్పు తీరుస్తాడు.”
“ఆయన ఎంత ఖచ్చితంగా తీర్పు ఇస్తాడని మీరు అనుకుంటున్నారు?” అని బదులిచ్చింది విమల.
ప్రతి ఒక్కరి మంచి మరియు చెడ్డలను దేవుడు ఒక పుస్తకంలో నమోదు చేస్తాడని యేసు ప్రభువు గ్రంధము చెబుతోంది’’ అని సైరా వివరించింది. “అంత్యకాలమందు, ప్రభువైన యేసుక్రీస్తు మేఘాలలో వస్తాడు. అందరూ ఆయనను చూస్తారు. పుస్తకంలో వ్రాయబడిన దాని ప్రకారం ఆయన మనలో ప్రతి ఒక్కరికీ తీర్పుతీరుస్తాడు.”
విమల ఆసక్తి పెరిగింది. “అయితే మన చెడ్డ క్రియల గురించి మనం ఏమి చేయాలి?” అని ఆమె అడిగింది.
వాళ్ళు దిగవలసిన స్థలమునకు చేరుకోగా వారు బస్‌లోంచి బయటికి దిగుచుండగా సైరా నవ్వింది. “అది ఉత్తమం. యేసుప్రభువు పాపపరిహారార్థబలిగా చనిపోయాడు మరియు తిరిగి జీవమునకు లేపబడినాడు. మనం మన పాపాలను ఒప్పుకొని, ఆయనను విశ్వసిస్తే, జీవితాన్ని త్యాగం చేసిన ఆయన మంచి పని చాలా శక్తివంతమైనది, అది మన చెడు పనులన్నింటినీ పుస్తకం నుండి తొలగిస్తుందని ఆయన వాగ్దానం చేశాడు.”
ఉత్తమ తీర్పు సందేశం
నిర్లక్ష్యానికి గురైన మహిళల అవసరాలను తీర్చే కేంద్రంవద్దకు వారు చేరుకున్నారు. రోజువారీ భోజనం కోసం బయట వేచి ఉన్న బక్కచిక్కిన పేద, వితంతువులను చూసింది విమల. ముదురు సన్ గ్లాసెస్ వెనుక నల్లటి కన్ను దాచడానికి ప్రయత్నిస్తున్న ఒక మధ్యతరగతి స్త్రీ త్వరగా లోపలికి ప్రవేశించడం ఆమె చూసింది. విమల హృదయం కరుణతో పిండుకుంది. బాధపడిన స్త్రీ ఆమె మాత్రమే కాదు!
“నువ్వు బాగున్నావా?” సైరా గమనించింది.
“అవును, నేను బాగానే ఉన్నాను,” విమల స్పందించింది. “కానీ మన న్యాయమూర్తిగా ఉండడానికి ప్రభువైన యేసు త్వరలో రావాలని నేను ఆలోచించడం ప్రారంభించాను. ఆయన దుష్టులను కనుమరుగయ్యేలా చేస్తాడు మరియు శిష్టులు శాశ్వతంగా నివసించడానికి అందమైన ప్రదేశానికి తీసుకువెళ్లబోతున్నాడనేది నిజమైతే, ఇది నేను ఎన్నడు వినని అత్యుత్తమ తీర్పు!”
మీరు ప్రభువైన యేసు గ్రంథం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కాగితం వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications