లోకాంతము: దిగ్భ్రాంతిని కలిగించే ప్రవచనం!

లోకాంతము: దిగ్భ్రాంతిని కలిగించే ప్రవచనం!

Summary

మన ప్రపంచం యొక్క భవిష్యత్తు రహస్యం కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తు గ్రంథమైన బైబిల్లో ముందే చెప్పబడింది. అంతం ఎప్పుడు సమీపిస్తుందో తెలుసుకునేలా నిర్దిష్టమైన సూచనల కోసం కానిపెట్టమని యేసు చెప్పాడు. మనం ఆయన బోధలను అనుసరించి, ఆయనపై నమ్మకం ఉంచితే, భవిష్యత్తు గురించి మనకు నిశ్చయత ఉంటుంది. లోకాంతం మరియు నిత్యత్వం యొక్క ప్రారంభానికి ఎలా సిద్ధంగా ఉండాలో ఈ కరపత్రం చెబుతుంది.

Type

Tract

Publisher

Sharing Hope Publications

Available In

11 Languages

Pages

6

Download

మరింత సౌకర్య స్థానాన్ని కనుగొనడానికి రమణదీప్ తన ముసలి శరీరాన్ని మార్చుకున్నాడు. ఇటీవల కాలములో అతని కీళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, మరియు ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఉన్నాయి మరియు అతను వరి పైరు పొలాల వైపు చూస్తే, రంగులు కలిసి అస్పష్టం అనిపించాయి. తన కోడలు భోజనం వండడం వినగలిగాడు, తన కుటుంబం తనను భారంగా చూస్తుందా అని అతను ఆశ్చర్యపోయాడు. వృద్ధాప్యం తేలిక అవలేదు—అతనికి లేదా అతని సంరక్షకులకు.

తాను యవ్వనములో ఉండగ తన గురువు ఏమి చెప్పాడో మరియు గుడికి ఇంకా నడవగలిగిన దాని గురించి అతడు ఆలోచించాడు. ఈ ప్రపంచములో నాలుగు యుగాలు ఉన్నాయని అతని గురువు చెప్పాడు—ప్రతి ఒక్కటి క్రమంగా అధ్వాన్నంగా పెరుగుతోంది. చివరిది యుగం—కలియుగం—అన్నింటికంటే నీచమైనది, దుర్మార్గం, దుఃఖం మరియు చీకటితో నిండి ఉంటుంది. రమణదీప్ నిట్టూర్చాడు. బహుశా కలియుగం వృద్ధాప్యం లాంటిది—ఒకప్పుడు మంచిగా ఉన్నప్పటికీ ఆఖరిగా అధోకరణం చెందుట. భూకంపాలు, వ్యాధులు, హత్యలు మరియు యుద్ధాల వల్ల ప్రజలు ఎలా మరణిస్తున్నారనే వార్తలను అతడు విన్నాడు. మరణించని వారు భౌతికవాదులు, అణగారిన వారు మరియు అనైతికులుగా అవుతున్నారు.

ఈ దుఃఖకరమైన ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది? అతని ముసలి శరీరం—మరియు దిగజారుతున్న గ్రహం—మళ్లీ పుట్టగలవా?

భూమి యొక్క భవిష్యత్తు చెప్పుట

నేను మీకు ఒక దైవిక ప్రవచనకర్తను పరిచయం చేయాలనుకుంటున్నాను, ఆయన చెప్పిన భవిష్యత్తు సంకేతాలను నేను అవ్యక్త ముగా విశ్వసిస్తాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మానవునిగా భూమి మీదకి వచ్చాడు, ప్రజలను స్వస్థపరిచాడు మరియు పరలోక రాజ్యం ఎలా ప్రవేశించగలరో అందరికీ బోధించాడు. 33 సంవత్సరాల వయస్సులో, ఆయన తన జీవితాన్ని త్యాగంగా ఇచ్చాడు. అప్పుడు, ఆశ్చర్యకరంగా, ఆయన మరణం నుండి మళ్లీ లేచాడు! మనం ఆయనను విశ్వసిస్తే మరియు విధేయులైతే, ఆయన త్యాగం మనకు క్షమాపణ మరియు విముక్తిని సాధిస్తుందని ఆయన అన్నాడు.

ప్రభువైన యేసు మన ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాడు మరియు ప్రస్తుత దుష్ట యుగాన్ని అంతం చేస్తానని పేర్కొన్నాడు. ఆయన గ్రంథం, అయిన బైబిలు అది ప్రవచనాలతో నిండిన గ్రంథం. అంతం ఎలా సమీపంగా ఉందో మనం తెలుసుకోగలగడానికి ఆయన ప్రవచనాల యెడల మనం శ్రద్ధ వహించాలి.

ప్రపంచము యొక్కఅంతం

ఒకరోజు, యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయనను, అడిగారు: “నీ రాకడకు మరియు యుగసమాప్తికి సూచన ఏమిటి?” అని. (బైబిలు, మత్తయి 24:3) యుగసమాప్తికి ముందుగానే ఆయన రాకడ సమీపించిందని తెలుసుకొనుటకు మనకు సహాయపడే సూచనలు జరుగుతాయని ప్రభువైన యేసు వారితో చెప్పాడు. ఈ సూచనలలో ఇవి ఉన్నాయి:

  1. అబద్దపు రక్షకులు. ప్రభువైన యేసు, వారితో ఇట్లనెను: “ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు” (బైబిలు, మత్తయి 24:4–5). ప్రభువైన యేసు అని చెప్పుకునే వంచకులచే మనం మోసపోకూడదు. అతని నిజమైన రాకడ ప్రపంచమంతటా కనిపిస్తుంది—“తూర్పు నుండి పడమరకు మెరుస్తున్న మెరుపులా” (మత్తయి 24:27)—మరియు ప్రపంచం మొత్తం భయంకరమైన మరియు ఆశ్చర్యపరిచే తెగుళ్ళతో కదిలిన తర్వాత జరుగుతుంది.

  2. యుద్ధాలు మరియు యుద్ధాల పుకార్లు. యేసు ప్రభువు ఇలా అన్నాడు: “మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవర పడకుండా చూసుకోండి; ఎందుకంటే ఇవన్నీ జరగాలి, కానీ ముగింపు ఇంకా రాలేదు. ఎందుకంటే జాతికి వ్యతిరేకంగా దేశం, రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం పెరుగుతుంది” (మత్తయి 24:6–7). మనం యుగం ముగింపుకు చేరుకున్నప్పుడు, యుద్ధాలు మరింత తరచుగా మరియు మరింత తీవ్రంగా మారతాయి. 

  3. క్షామములు, భూకంపాలు మరియు తెగుళ్లు. ఆయన ప్రవచించిన మూడవ సూచన ఏమిటంటే, “అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేధనలకు ప్రారంభము” (మత్తయి 24:7–8). ఈ శతాబ్దం మొదలుకొని 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు కరువుతో బాధపడ్డారు. 2015 లో నేపాల్‌లో 8,000 మందిని చంపిన భూకంపం, చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి. వ్యాధి లెక్కలేనన్ని జీవితాలను బలిగొంది. నిశ్చయంగా, ప్రభువైన యేసు ఏమి ప్రవచించాడో దానిని మనం చూస్తున్నాం. 

  4. నైతిక క్షీణత. ప్రభువైన యేసు ఇలా అన్నాడు: “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును” (మత్తయి 24:12). భారతదేశంలో ప్రతిరోజూ సగటున 91 అత్యాచారాలు మరియు 79 హత్యలు జరుగుతున్నాయని అంచనా. తమ పనులు ఇతరులను ఎలా బాధపెడుతున్నాయో పట్టించుకోనంతగా స్వీయ కేంద్రీకృతులై ప్రజలు పెరుగుతున్నారు.

ప్రభువుయైన యేసు మహిమ మేఘాలలో తిరిగి రాకడకు ముందే ఉండు ఈ సూచనలను ప్రవసించెను.  ఈ సూచనలు సంభవించడం మనం చూస్తుండగా, ఆయన ప్రవచనాలు నిజమని మరియు ఆయన రాకడ చాలా దగ్గరగా ఉందని మనం తెలుసుకోవచ్చు!

యేసు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుట!

స్వార్థం, అహంకారం మరియు అనైతికతలో జీవించేవారు యేసు ప్రభువు వచ్చినప్పుడు సంతోషించరు. వాస్తవానికి, ఆయన మేఘాలలో తిరిగి వచ్చినప్పుడు, వారి చెడు పనులన్నీ ఒక విధ్వంసక క్షణంలో వారిపై పడతాయి. వారు ఆయన నుండి దాగుకొనబోవుదురు మరియు పర్వతములతోను బండల తోను: “మీరు మామీద పడి సింహాసనాసీనుడై యున్న వానినుండి మమ్మును మరుగు చేయుడని కేకలు వేస్తారు”
(బైబిలు, ప్రకటన 6:16).

అయితే ప్రభువైన యేసు బలిలో విశ్వాసముంచిన వారు, ఆ రోజున, తక్షణమే మారతారు మరియు నూతన మరియు అమర్త్య శరీరాలు ఇవ్వబడతారు. వారు మేఘాలలో తేలనై యున్నారు మరియు ఈ పాతదైన లోకంనుండి శాశ్వతంగా తప్పించుకోనై యున్నారు. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉన్న వ్యక్తులలో ఒకరుగా ఉండాలనుకుంటే, మీరు ఈ రోజు ఈ సాధారణ ప్రార్థన చేయగలరు:

ప్రియమైన సృష్టికర్త అయిన దేవా, ప్రభువైన యేసు త్వరలో తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నాను. నేను పరలోకానికి తీసుకెళ్లబడిన వారిలో ఉండునట్లుగా దయచేసి ఇప్పుడు యేసు ప్రభువును ఎలా తెలుసుకోవాలో మరియు విశ్వసించాలో నాకు నేర్పుము. ఆమెన్.

మీరు యేసు ప్రభువు ప్రవచించిన భవిష్యత్తు ప్రవచనాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కాగితం వెనుక ఉన్న సమాచారం వద్ద మమ్మల్ని సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover