
అంతిమ విమోచన
Summary
బాధ శాశ్వతంగా కొనసాగుతుందని అనిపించవచ్చు, కానీ అది ఏదో ఒక రోజు ముగుస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన తన ప్రజలను "స్వర్గ రాజ్యం" అనే ప్రదేశానికి తీసుకెళ్లడానికి ఈ భూమికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. ఈ అద్భుతమైన ప్రదేశంలో, దుఃఖం లేదు, మరణం లేదు మరియు పునర్జన్మ వృత్తాలు లేవు. సృష్టికర్త అయిన దేవునితో మనం శాశ్వతంగా జీవిస్తాం! మన అంతిమ విడుదల కోసం మనం ఎలా సిద్ధపడవచ్చో ఈ కరపత్రం తెలియజేస్తుంది.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
11 Languages
Pages
6
గంగానది ఒడ్డున, ఒక పూజారి అంత్యక్రియలు నిర్వహిస్తు చివరి గమ్యం అయిన మోక్షంవైపు ఒక శరీరం నుండి మరొక శరీరానికి మరణించిన వాని యొక్కఆత్మ ప్రయాణిస్తుందని వివరిస్తున్నాడు. గుంపులో ఉన్న ఒక చిన్న బాలుడు ఆసక్తిగా వింటున్నాడు. పక్కనే ఉన్న వ్యక్తి వైపు తిరిగి, అకస్మాత్తుగా: “ఇది ఎప్పుడు ముగుస్తుంది?” అని అడిగాడు.
చాలా మంది యోచించె ప్రశ్నను అతడు అడిగాడు. బాధాకరమైన చక్రం నుండి తప్పించుకోవడానికి ముందు ఎన్ని జన్మలు మరియు పునర్జన్మలు అవసరం? ఇది చరిత్రలో లెక్కలేనన్ని సార్లు అడగబడింది, మరియు ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇవ్వబడలేదు.
ఈ భూమిపై, జననం, మరణం, మరియు బాధలు యొక్క చక్రాలు సాధారణం. కానీ ఈ ప్రపంచానికి ఆవల, దేవుడు నివసించే స్థలములో, బాధాకరమైన చక్రాలు లేవు—శాశ్వతమైన జీవితం, అంతులేని ఆనందం మాత్రమే ఉన్నాయ్. కృతజ్ఞతగా, బాధలు మరియు కష్టాలు నుండి విముక్తి పొందడానికి లక్షల కొలది మరణాలు మరియు పునర్జన్మల గుండా వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా ఉత్తేజకరమైన విషయం గురించి మీకు నన్ను చెప్పనీయండి.
శాశ్వితముగా బాధ నుండి తప్పించుకోండి!
చాలా కాలం క్రితం, యేసు ప్రభువు మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు మరియు అనేక ఇతర అద్భుతమైన పనులను చేశాడు. ఆయన “పరలోక రాజ్యం” అని పిలువబడే ఒక ప్రత్యేక స్థలం గురించి కూడా బోధించాడు. అనారోగ్యం, బాధలు లేని, పునర్జన్మ అవసరం లేని ప్రదేశమే పరలోక మని అన్నారు. ఆ అందమైన ప్రదేశంలో అందరూ నిత్యమూ జీవిస్తారు.
ప్రభువైన యేసు ఈ అద్భుతమైన రాజ్యం గురించి బోధించాడు, మరియు ఆపై మన చెడ్డ పనుల పర్యవసానాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేసాడు, తద్వారా మనం కోరుకుంటే అక్కడికి వెళ్ళగలము.
ఆయన త్యాగపూరితమైన మరణం తర్వాత సమాధి నుండి మూడవ దినమున లేచి పరలోక రాజ్యమునకు ఆరోహణమైయ్యాడు. ఆయన తన అనుచరులను పరలోకమునకు తీసుకెళ్లడానికి ఈ యుగాంత మందు తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు.
ఇది అద్భుతమైన భవిష్యత్తుగా అనిపించడం లేదా? బాధ నుండి శాశ్వతంగా తప్పించుకోడానికీ—మనలో ప్రతి ఒక్కరూ విమోచనను పొందాలని యేసు కోరుకుంటున్నాడు. ఐతే చిన్న బాలుడు “ఇది ఎప్పుడు ముగుస్తుంది” అడిగినట్లుగా, మనము కూడా విమోచనను పొందడానికి ఎంత సమయం పడుతుందోనని ఆశ్చర్య పడుతున్నాము.
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరాగమనం
ఆసక్తికరమైనదిగా, యేసు ప్రభువు శిష్యులు కూడా ఇదే ప్రశ్న అడిగారు—ఇది ఎప్పుడు ముగుస్తుంది? యేసు ప్రభువు ఈ యుగపు చివరి రోజులను తీవ్రమైన భూకంపాలు, యుద్ధాలు, ఆకలి, తెగుళ్లు, మరియు ఉపద్రవముల కాలముగ వర్ణించాడు. కష్టాలు వేగంగా పెరుగుచుండడం చూస్తుండగా ప్రజల హృదయాలు భయంతో విఫలమవుతాయి. ఇవి ప్రభువైన యేసు రాకడకు సంకేతాలు. ఈ సంకేతాలన్నీ జరుగుతున్నందున మనం యుగాంతంలో జీవిస్తున్నామని ఇప్పుడు మనం చూడ గలము.
త్వరలో, ప్రభువైన యేసు తాను వాగ్దానం చేసినట్లు తిరిగి వస్తాడు. చనిపోయినవారు భూమి నుండి లేపబడతారు మరియు పరిపూర్ణమైన కొత్త శరీరాలు ఇవ్వబడతారు, బైబిల్ చెప్పినట్లు: “ప్రభువు పరలోకము నుండి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో మరియు దేవుని బూరతో దిగివస్తాడు. మరియు క్రీస్తునందు మృతులైనవారు మొదట లేతురు ఖచ్చితంగా” (బైబిలు, 1 థెస్సలొనీయులు 4:16).
ఆ సమయంలో, మనము ఎరిగి ఉన్నఈ ప్రపంచము నాశనం అవుతుంది మరియు చెడు నిర్మూలించబడుతుంది. మనము వెయ్యేళ్ల సంతోషం కోరకు పరలోకమునకు వెళ్లనైయున్నాము. అప్పుడు, ప్రభువైన యేసు మరణం, వేదన బాధలు, అనారోగ్యంలు, నిరాశలు మరియు ఒంటరితనము రహిత ప్రపంచమును సౌందర్యములో, మరియు పరిపూర్ణతలో పునః-సృష్టిస్తాడు. మరియు ఆయన మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అక్కడ ఉంటారని వాగ్దానం చేశాడు. ఇదే యేసు మార్గం.
అంతిమ విమోచన
యేసు తన తిరుగు రాకడ యొక్క ఖచ్చితమైన రోజు లేదా ఘడియ వెల్లడించలేదు, కానీ ఆయన తన అనుచరులకు చాలా నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాడు, ఆ విధముగా ఆయన రాకడ చాలా దగ్గరగా ఉందని మనకు తెలుసు—బహుశా అది మీ మరియు నా జీవితకాలంలో. అద్భుతమైన వార్త! ప్రభువైన యేసు రాకడయందు, మన చెడు క్రియల పర్యవసానాల నుండి మనం విడుదల పొందుతాము!
పరలోక రాజ్యంలో ప్రవేశించేవారిలో మీరు కూడా ఉండాలనుకుంటే, యేసు మార్గాన్ని అనుసరించడానికి మూడు సాధారణ దశలు ఉన్నాయి:
ప్రభువైన యేసులో విశ్వాసముంచండి. యేసు తన జీవితాన్ని బలిగా ఇచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి చెడు పనుల యొక్క పరిణామాలను ఆయన భరించాడు. వాటి నుండి మనకు విముక్తి కలిగించగలుగునట్లు ఆయన ఇష్టపూర్వకంగా దీన్నిచేశాడు. మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు మనస్సుతో విశ్వసించుటం చేత మీరు ఈ బహుమతిని అంగీకరించగలరు.
వ్యక్తిగత సంబంధాన్ని వృద్ది చేసుకోండి. ప్రభువైన యేసు మనము కేవలం మతపరమైన విధుల యొక్క పట్టికను అనుసరించాలని కోరడం లేదు; మనం ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. మనము సన్నిహిత మిత్రునితో మాట్లాడు విధముగా మన హృదయాలను విప్పుతు మరియు మన రహస్యాలన్నింటినీ పంచుకుంటు ఆయనకు ప్రార్థన చేయవచ్చు. ప్రభువైన యేసు తన ఆత్మ ద్వారా ప్రతిరోజూ మనతో ఉంటాడని వాగ్దానం చేసాడు, కాబట్టి మనం యే సమయమందైనా ఆయనతో
మాట్లాడవచ్చు.ప్రభువైన యేసు బోధలను అనుసరించండి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుతూ మెలకువగా మరియు సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు. ప్రభువైన యేసు పట్ల భక్తి జీవితం గడించడమంటే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తాం, ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమిస్తాం మరియు మేఘాలలో ఆయన ప్రత్యక్షత కొరకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అర్థము. బైబిల్లో, ప్రభువైన యేసు అనుచరులుగా ఉండేందుకు మనం తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మనం కనుగొంటాము.
ఆయన రాకడ కొరకు సిద్దబాటులోయేసు మార్గాన్ని ఎలా అనుసరించాలో గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రం వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications