క్షమాపణ వెదకుట

క్షమాపణ వెదకుట

Summary

మనమందరం జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం. పాపం యొక్క పదునైన కర్మ కోసం మనం వేచి ఉండాలా లేక దైవిక క్షమాపణ వంటిది ఏదైనా ఉందా? ఈ కరపత్రం యేసు తప్పిపోయిన కుమారుని ఉపమానం యొక్క స్వదేశీ రూపాన్ని చెబుతుంది, సృష్టికర్త దేవుడు పాపులను అనురాంతో చేతులు చాపి ఎలా స్వాగతిస్తాడో మరియు జీవితకాల పాపాన్ని క్షణంలో ఎలా క్షమించగలడో చూపిస్తుంది.

Download

ప్రతాప్ ఒక ధనిక జమీందారి కమారుడు. వారు ఒక విశాలమైన భవనంలో నివసించారు మరియు వారికి చాలా మంది సేవకులు ఉన్నారు. ప్రతాపుకు ఖరీదైన దుస్తులు, శ్రేష్టమైన ఆహారం మరియు చదువు కూడ ఎల్లపుడు సమృద్ధిగా ఉన్నాయి—తల్లిదండ్రులు అతనిని ప్రేమించారని తెలుసు, ముఖ్యంగా తండ్రి అతన్ని ఎక్కువుగా ప్రేమిస్తాడు. 

కానీ ప్రతాప్ పెద్దయ్యేకొద్దీ, అతను మారడం ప్రారంభించాడు. పాత పద్ధతులు అతనికి ఏమాత్రము ఆకర్షణీయంగా లేవు. తండ్రి ఇల్లు మరియు తండ్రి మార్గాలు నిర్బంధంగా అనిపించడం ప్రారంభించాయి. ప్రతాప్ స్వేచ్ఛ కోసం తహతహలాడాడు. 

ఒకరోజు, ప్రతాప్ ప్రత్యేక అభ్యర్థనతో తండ్రి వద్దకు వెళ్ళమని తన తల్లిని వేడుకున్నాడు. అతను తనకు ఏమి కావాలో చెప్పినప్పుడు, ఆమె భయంలో ముడుచుకుంది. కానీ అడగడానికి అంగీకరించే వరకు అతడు ఆమెను ఒత్తిడి చేశాడు. కొన్ని రోజులు పట్టింది, కానీ చివరికి ఆమె ఏడుస్తూ వెనుతిరిగింది. 

“అతడు చేస్తాడు,” అంది ఆమె, కుమారుని మొఖము చూడలేక. “ఆయన మన ఆస్తిలో సగం అమ్మి మరియు నీ స్వాస్థ్యమును నీకు ఇస్తాడు. అయినా ఎందుకు, నా కుమారా? ఎందుకు?”

ప్రతాప్‌కి చిన్నపాటి పశ్చాత్తాపం కలిగింది, కానీ అతను ఉత్సాహంగా కూడా ఉండెను. అతని ప్రణాలిక ఫలించింది. తాను కోరుకున్న జీవితాన్ని గడపడానికి తన తండ్రి డబ్బులో నుండి తన వాటాను పొందుతాడు.

ఇష్టానుసారమైన జీవితం

ప్రతాప్ పెద్ద నగరానికి వెళ్ళాడు. అతను ఖరీదైన పెంట్‌హౌస్‌ని అద్దెకు తీసుకొనెను మరియు కొత్త స్నేహితులను చేసుకోవడం మొదలు పెట్టెను. త్వరలో అతను ధనవంతులను మరియు ప్రసిద్ధులను ఆకర్షించే పార్టీలను విసురుతున్నాడు. అతను కార్లు కొన్నాడు, అందమైన ఆడవాళ్ళతో పడుకున్నాడు, ఖరీదైన రెస్టారెంట్లలో తిన్నాడు. అతను కోరుకున్నవన్నీ అతను కలిగి ఉన్నాడు.

అయితే ఒకరోజు, ఉన్నడబ్బు అంతా అయింది. సిగ్గుపడ్డాడు, అతను తన కొత్త స్నేహితులలో కొందరిని తనకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగాడు, కానీ వారు అకస్మాత్తుగా కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానారు. అతను తన బిల్లులను చెల్లించలేకపోయాడు. చివరకు, భూస్వామి అతన్ని ఖాళీ చేయించాడు. డబ్బు మరియు స్నేహితులు లేకుండా, అతను ఎక్కడికి వెళ్ళగలడు?

ప్రతాప్ కంగారుగా, ఆత్రుతగా నగరంలో తిరిగాడు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు, అతడు భయపడ్డాడు. అతడు ఎక్కడ పడుకుంటాడు? అతడు ఏమి తింటాడు? ప్రతాప్ తన జీవితంలో మొదటిసారిగా, ఆకలితో కడుపు నింపుకున్నాడు, వీధిలో పడుకున్నాడు.

విచారం ఎదుర్కొనుట

తర్వాతి రోజుల్లో ప్రతాప్ నగరంలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అతను వీధిలో నిద్రిస్తున్నప్పుడు బికారివాడిగా కనిపించాడు, అయితే వ్యాపారములో అంతగా లాభము లేని ఓ చిన్న రెస్టారెంట్ మేనేజరు తప్ప అతనికి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతాప్ గంటల తరబడి, భోజనం చేసేవారికి ఆహారం తీసుకువెళుతూ, బల్లలు తుడుస్తూ పని చేసాడు. అతనికి చాలా ఆకలిగా, అలసటగా అనిపించింది. ధనవంతుడి కొడుకు అయిన తాను, భోజనం వడ్డించడం ఎలా సాధ్యమని అతను ఆశ్చర్యపోయాడు! రెస్టారెంట్ నుండి చివరి వ్యక్తి వెళ్లిన తర్వాత, అతను గిన్నెలు కడగుటకు సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్లాడు. చెత్త కుండీ దగ్గర సగం-తిన్న రోటీ ఉన్న ప్లేట్ చూశాడు. అతను చాలా ఆకలిగా భావించాడు, అతను దానిని తీసుకోవడానికి దాదాపు చేరుకున్నాడు.

నాతో తప్పు ఏమిటి? అతను తనను తాను దూషించుకున్నాడు. మా నాన్నగారి ఇంట్లో సేవకులకు కూడా తినడానికి సరిపడా రోటీలు ఉన్నాయి, అదనంగా మిగిలి ఉన్నాయి. మరియు ఇక్కడ నేను ఉన్నాను, ఈ మురికిగా మిగిలిపోయిన వాటితో శోదించబడ్డాను!

అతను గిన్నెల గుట్ట వైపు చూశాడు మరియు చాలాసేపు ఆలోచించాడు.

నేనేం చేస్తానో నాకు తెలుసు, అని అతడు అనుకున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాను, “తండ్రీ, నీకు మరియు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని చెబుతాను. నేను ఇకపై నీ కుమారుడిగా ఉండటానికి అర్హుడను కాను. దయచేసి నన్ను మీ కూలీ సేవకులలో ఒకరిగా చేసుకోండి.”

ఒక్క గిన్నె కూడా కడగకుండా, ప్రతాప్ రెస్టారెంట్ నుండి బయలుదేరి ఇంటికి ప్రయాణం ప్రారంభించాడు.

ఇంటికి తిరిగి వచ్చుట

ప్రతాప్ ఇంటికి వెళ్లుచుండగా మనస్సులో ఆలోచించడానికి చాలా విషయాలు ఉన్నాయ్. తండ్రి తనని చూచినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడు? అతను ఇంటికి వచ్చినప్పటికి ఏమి చెప్పాలో అభినయించుకొనెను, కానీ అది అతనికి అంత బాగా అనిపించలేదు. చివరగా, సుదీర్ఘ ప్రయాణం తర్వాత, అతను దూరంగా తన తండ్రి ఇంటిని చూచాడు. మెల్లగా రోడ్డు మీదకు నడిచాడు.

అకస్మాత్తుగా, ఒక కేక విన్నాడు. సాధారణంగా చాలా ప్రశాంతంగా మరియు గౌరవప్రదంగా, ఉన్న అతని తండ్రి, ఇంటి బయటకు పరుగెత్తాడు. ప్రతాప్ దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్రతాప్‌కి తన గుండె పగిలిపోతుందని భావించాడు.

“తండ్రీ,” అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, “నేను మీకు మరియు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను. ఇకపై నీ కుమారుడిగా ఉండే అర్హత నాకు లేదు...”

ఒక్క మాట కూడా విననట్లుగా తండ్రి కనిపించాడు. అతని మొహంలో కన్నీళ్ళు ధారలుగా కారుతున్నాయి. కలకలం గొడవ విన్నారు ఇంటి పని మనుషులు మరియు పరుగున వచ్చారు.

“త్వరగా!” తండ్రి వారిని ఆజ్ఞాపించాడు. “అతని గదిని సిద్ధం చేయండి! తాజా వస్త్రాలు అతని కోసం తీసుకురండి! విందును సిద్ధం చేయండి, ఎందుకంటే మనము వేడుక జరుపుకుందాము! ఇతడు నా కొడుకు—చనిపోయాడు మరియు బ్రతికి ఉన్నాడు; అతను తప్పిపోయాడు మరియు ఇప్పుడు దొరికాడు!”

క్షమాపణను కనుగొనుట

ఈ కథ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమును ఆధారంగా, సృష్టికర్త అయిన దేవుని నుండి మనం ఎలా క్షమాపణ పొందవచ్చో వివరించడానికి ఇది రూపొందించబడింది. మనం జీవితంలో పొరపాట్లు చేసినప్పుడు—చాలా పెద్దవి కూడా—ప్రతాప్ తన తండ్రి వద్దకు తిరిగి వచ్చిన విధంగా మనం దేవుని వద్దకు తిరిగి రావచ్చు. మనము సంక్లిష్టమైన ఆచారాలు లేదా త్యాగాలను అందించాల్సిన అవసరం లేదు. దేవుడు చాచిన చేతులతో మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మారిన హృదయానికి అత్యంత విలువనిస్తాడు. మనం వినయంగా మన పాపాలను ఒప్పుకోవాలి, నిజంగా విచారించాలి మరియు క్షమాపణ కోసం అడగాలి. దేవుని క్షమాపణ అనే దివ్య అద్భుతాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారా? మీరు ఈ రోజు శుద్ధి అవ్వండి, ఇప్పుడే, మీరు చేసిన ప్రతి తప్పు నుండి. మీరు ఇలాగ ప్రార్థన చేయవచ్చు:

ప్రియమైన దేవా, నా పాపాలకు నేను ప్రగాఢంగా చింతిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప త్యాగం బట్టి దయచేసి నన్ను క్షమించి, ప్రతి అపవిత్రత నుండి నన్ను శుద్దిచేయుడి. అంతరంగములో నన్ను నూతన వ్యక్తిగా మార్చుము. ఆమెన్.

మీరు ప్రభువైన యేసుక్రీస్తు బోధనల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover