
అద్భుతాల రోజు
Summary
విమల్‌కి అతని భార్యతో దెబ్బతిన్న సంబంధం రోజురోజుకు దిగజారుతోంది. కానీ ఒక రోజు, అతను సబ్బాతు దినము గురించి తెలుసుకున్నాడు, సృష్టికర్త దేవుని గౌరవార్థం అది ప్రత్యేక పవిత్ర దినం అని నేర్చుకున్నాడు. అతను యేసు ప్రభువు యొక్క పవిత్ర గ్రాంధాన్నిచదవడం ప్రారంభించాడు మరియు ప్రతి వారం విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాడు. మెల్లగా విమల్ కోపం తగ్గింది, అతని వైవాహిక జీవితంలో ఏదో ప్రత్యేకత మొదలైంది.
Type
Tract
Publisher
Sharing Hope Publications
Available In
11 Languages
Pages
6
విమల్ తన ఆటో రిక్షాను రోడ్డు పక్కకు లాగాడు. అతను రోజంతా చాలా మంది కస్టమర్‌లను కలిగి ఉన్నప్పటికీ, అతను సంతోషం స్పృశించలేదు. అతను తన పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. అది పడిపోతోంది!
అతను తన భార్య సీమను ప్రేమించాడు—కాని కొన్ని రోజులకొకసారి ఆమెను కొట్టకుండా ఆపుకోలేకపోయాడు. ఆమె అతనికి చాలా కోపం తెప్పించింది. అతను దీన్ని చేయాలనుకోలేదు, కానీ అది జరిగింది.
మతపరమైన ఆచారాల సమయంలో, సీమా ఆత్మలచే ఆవహించబబడెను మరియు క్రూరంగా నృత్యం చేయును, ఆమె శరీరంపై నియంత్రణ కోల్పోతుంది మరియు ఆమె బట్టలు చింపుకుంటుంది. ఆమెకు ఆమెపై నియంత్రణ కోల్పోవు విధము విమల్ ఇష్టపడలేదు. ఆచారాలకు వెళ్లడం మానమని అతను ఆమెకు చెప్పాడు, కానీ ఆమె వినదు. ఆమె జంతుబలితో నలిగిపోయిన దుస్తులు మరియు ముఖం మీద రక్తంతో ఇంటికి చేరుకుంటుంది, మరియు విమల్ కోపి అయ్యి మరియు ఆమెను కొట్టాడు.
సీమా రెండుసార్లు గర్భవతి అయింది కానీ ఆమె ఉన్మాద ఆచారాల కారణంగా గర్భస్రావం అయ్యింది. ఆమె మరింత మొండిగా మారింది, మరియు విమల్ కోపగించాడు, కృంగిపోయాడు, దోషి అయ్యాడు.
ఒక మంచి మార్గం
విమల్ తన ఆటో రిక్షాలో కూర్చుంటుండగా, అతను ఉత్తమ జీవన విధానము కొరకు తీవ్రంగా ఆశించాడు. అకస్మాత్తుగా, అతను రహదారికి సమీపంలో ఉన్న భవనం లోపల నుండి స్వరాలు విన్నాడు. లోపల పిల్లలు మరియు పెద్దలు ఉన్నారు, ఎవరో కథ చెబుతుంటే వారు వింటున్నారు.
అతను తన కష్టాల నుండి పారిపోతున్న వ్యక్తి గురించి కథకుడు మాట్లాడాడు. అతను తన కవల సోదరుడికి ద్రోహం చేసాడు మరియు అతనిని తీవ్రంగా బాధపెట్టాడు, అతను తన ప్రాణానికే భయపడతాడు. అతను పారిపోతుండగా, అతను అరణ్యంలో నిద్రించడానికి ఆగాడు. దిండులాగా ఒక రాయి తప్ప అతనికి సౌకర్యంగా ఏమీ లేదు. అతని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి తాను చేసిన పనికి అతను ఒంటరిగా భావించాడు మరియు జాలిపడ్డాడు.
విమల్ నిశితంగా విన్నాడు. ఈ మనిషి ఎలా భావించాడో అతనికి తెలుసు.
కథకుడు కొనసాగించాడు. ఆ వ్యక్తి నిద్రపోతుండగా, అతనికి ఒక కల వచ్చింది. అతను ఒక నిచ్చెన పరలోకము వరకు చేరుకోవడం చూశాడు. విచారకరమైన, విరిగిన ఈ వ్యక్తికి దీవెనలు తెస్తున్నట్లు దేవదూతలు నిచ్చెన పైకి క్రిందికి వెళ్లారు. నిద్ర లేవగానే, ఆనందంగా అనిపించింది అతనికి. అతను దిండుగా ఉపయోగించిన రాయితో తన దేవునికి స్మారకాన్ని నిర్మించాడు. నిచ్చెన యొక్క దర్శనం అతనికి మరోసారి దేవునితో అనుసంధానించబడిన అనుభూతిని కలిగించింది, మరియు ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని అతనికి తెలుసు.
ఒక కొత్త పుస్తకం
జనం వెళ్ళిపోయాక విమల్ సిగ్గుపడుతూ భవనంలోనికి ప్రవేశించాడు.
కథకుడు “హ్యాపీ సబ్బాతు,” అని అతన్ని పలకరించాడు.
“సబ్బాతు అంటే ఏమిట?” కుతూహలంగా అడిగాడు విమల్.
“మేము సృష్టికర్త దేవుడిని ఆరాధిస్తాము,” అని కథకుడు సమాధానమిచ్చాడు. “మరియు ఆయన వారంలోని ఏడవ రోజు సబ్బాత్ నాడు ఆరాధించమని అడుగుతాడు, ఎందుకంటే ఆయన ఆరు రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ మనిషి కలలోని నిచ్చెన పరలోకమును మరియు భూమిని అనుసంధానించినట్లే, సబ్బాత్ అనేది మనలను దేవునితో అనుసంధానించే వారపు పరిశుద్ద దినం. ఈ రోజున మనం ఆరాధించినప్పుడు, సృష్టికర్త అయిన దేవునిపై మన భక్తిని ప్రదర్శిస్తాము మరియు ఆయన ఆశీర్వాదాలను పొందుతాము.”
కవల సోదరుల కథ విమల్‌ని హత్తుకుంది. “మీకు ఆ కథ ఎక్కడ దొరికింది?”
“ఇది యేసుక్రీస్తు ప్రభువు గ్రంథం ఐన బైబిల్ నుండి,” కథకుడు అలమార నుంచి పుస్తకాన్ని తీశాడు మరియు విమల్‌కి ఇచ్చాడు. “మీరు కథను ఇక్కడ చదవవచ్చు.”
విమల్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి కొత్త పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతను చదువగావు అతను ఓదార్పుగా భావించాడు మరియు తరువాతి శనివారం తిరిగి వచ్చాడు. అతను నిశ్శబ్దంగా కూర్చుని, సృష్టికర్త అయిన దేవునికి తన పరిశుద్ధ దినమున ప్రార్ధించినప్పుడు, అతని హృదయంలో ఏదో అద్భుతమైన సంఘటన జరగడం ప్రారంభమైంది.
ఒక మారిన మనిషి
ఒకరోజు, విమల్ తన కొత్త పుస్తకాన్ని చదువుతున్నప్పుడు: “మీరు దేవుని ఆలయమని మరియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?” అనే పద్యం అతనికి కనిపించింది, (1 కొరింథీయులకు 3:16) అతని మనస్సులో అకస్మాత్తుగా వెలుగు వచ్చింది.దేహము దేవుని ఆలయము కాబట్టి, దానికి హాని కలిగించే హక్కు ఎవరికీ లేదని అనుకున్నాడు. నేను ఇకపై నా భార్యను కొట్టకూడదు.
అతను గతంలో చాలాసార్లు ఆపడానికి ప్రయత్నించాడు, కానీ ఈసారి అది నిజంగా పనిచేసింది. సబ్బాత్ రోజున బైబిలు చదవడం మరియు ఆరాధించడం తన హృదయాన్ని మార్చుకోవడానికి సహాయం చేసిన సృష్టికర్త దేవునితో తనను అనుసంధానించిందని అతనికి తెలుసు. ఒక దివ్యమైన హస్తం అతని ఛాతీలోంచి పాషాణ హృదయాన్ని తీసి దయగల హృదయంతో భర్తీ చేసినట్లు అనిపించింది.
పునర్ కలయిక!
అనేక సంవత్సరాలు, విమల్ పవిత్రమైన పరిశుద్దమైన సబ్బాతు దినమున సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించడం కొనసాగించాడు. మెల్లగా, ఆమె భర్తలో వచ్చిన మార్పుని గమనించింది సీమ. అతను ఇకపై ఆమెను కొట్టలేదు. బదులుగా, అతను సౌమ్యుడు మరియు దయగలవాడు అయ్యాడు.
ఇప్పటికి, సీమ బాగా అలసి పోయింది మరియు నిరాశకు లోనైంది. ప్రభువైన యేసుక్రీస్తు గ్రంథము చదివి, శనివారాల్లో ఆరాధన ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విమల్ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించడం ఆమె గమనించింది. చివరగా తనతో పాటు వెళ్లాలనుకుంకుంటుందా అని ఆమెను అడిగినప్పుడు, ఆమె అంగీకరించింది.
“మా కుటుంబానికి సబ్బాత్ ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన పరిశుద్ద దినం,” అని చెప్తున్నాడు విమల్. “దేవునితో సంబంధము కలిగి ఉండుటకు ఆయన మనల్ని ఆహ్వానించుచున్న రోజు అది. మనం ఆయనతో ఈ విధంగా సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. నా భార్య మరియు నేను ఈ రోజు సంతోషకరమైన వివాహం కలిగియున్నామని నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రతిరోజూ సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాను మరియు ముఖ్యంగా విశ్రాంతి రోజున. సబ్బాత్ ఆశీర్వాదాలు మనల్ని దేవునికి మరియు ఒకనికొకరిని దగ్గర చేస్తాయి.”
ఈ రోజు, విమల్ మరియు సీమ ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. వారు తమ పొరుగువారందరికీ సబ్బాత్ రోజు ఆశీర్వాదాల గురించి చెబు తున్నారు.
మీరు సబ్బాత్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే లేదా బైబిల్ పొందాలనుకుంటే, దయచేసి ఈ పేపర్ వెనుక ఉన్న సమాచారం వద్ద మమ్మల్ని సంప్రదించండి.
Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Sign up for our newsletter
Be the first to know when new publications are available!

Find Your Audience
Featured Publications
© 2024 Sharing Hope Publications