దేవుని ప్రత్యేక జనాంగము

దేవుని ప్రత్యేక జనాంగము

Summary

ప్రభువైన యేసుక్రీస్తు రాబోయే యుగంలో పరిపూర్ణ ప్రపంచాన్ని ఎలా పునఃసృష్టిస్తాడో మనకు చెప్పాడు. ఆయన ప్రత్యేక ప్రజలు అక్కడ శాశ్వతంగా ఉంటారు. ఈ ప్రత్యేక ప్రజలు ఎవరు? బైబిలు వారిని "శేషజనము"అని పిలుస్తుంది. ఈ కరపత్రం శేషజనము గురించి క్లుప్తంగా వివరిస్తుంది మరియు వారంతా ఏ సంఘటనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలియజేస్తుంది.

Download

సుదీర్ఘ ప్రయాణమునకు ముందు తన దాసులను సమీకరించుటకు తన యెద్దకు పిలిచిన వ్యక్తి గూర్చిన ఒక కథ చెప్పబడింది. ఒక సేవకుడికి, అతను ఒక పెద్ద డబ్బు సంచి ఇచ్చాడు; రెండవ సేవకుడికి, మధ్య తరహా డబ్బు సంచి; మరియు మూడవ సేవకుడికి, చాలా చిన్న డబ్బు-సంచి ఇచ్చాడు—ఒక్కొక్కటి వారి సామర్థ్యాన్ని బట్టి. తను వెళ్లియుండగా తన ఆస్తిని వారే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు అతను బయలుదేరాడు.

మొదటి దాసుడు అతని డబ్బు తీసుకొని వ్యాపారం చేయడం ప్రారంభించాడు. రెండవ దాసుడు కూడా తన డబ్బుతో వ్యాపారంలో నిమగ్నమయ్యాడు. వారు కష్టపడి పనిచేశారు, త్వరలోనే ఇద్దరూ తమకు అప్పగించిన మొత్తాన్ని రెట్టింపు చేశారు. 

కానీ చిన్న డబ్బు సంచితో ఉన్న మూడవ దాసుడు, వారికి చాలా భిన్నంగా ఉన్నాడు. అతడు డబ్బును భద్రపరచడానికి భూమిలో ఒక గొయ్య త్రవ్వాడు—పాతిపెట్టాడు తర్వాత అతడు విశ్రమించాడు, యజమానుడు దూరముగా ఉండగా అనేక సోమరి సంవత్సరాలు ఆనందించాడు.

చివరకు, యజమానుడు తిరిగి వచ్చాడు. మొదటి ఇద్దరు దాసులు ఎలా కష్టపడి తన ఆస్తులను రెట్టింపు చేశారో అతనికి చూపించారు. అతను అన్నాడు: “బాగా చేసారు! మీరు మంచి మరియు నమ్మకమైన సేవకులు. మీరు చిన్న విషయాలలో మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని గొప్ప విషయాలపై ఉంచుతాను.” అనంతరం వారికి బహుమానం ఇచ్చాడు.

మూడో దాసుడు కృంగిపోతూ మరియు సిగ్గుపడుతూ ముందుకు వచ్చాడు. “బోధకుడ,” అతను అన్నాడు, “మీరు కఠినమైన వ్యక్తి, నాటని చోట పండించే మరియు విత్తనం వేయని చోట సేకరించే వ్యక్తి మీరు అని నాకు తెలుసు. నేను భయపడ్డాను, కనుక వెళ్లి నీ డబ్బును భూమిలో దాచాను. ఇక్కడ, మీది మీకు ఉంది— కొంచెం కూడా కోల్పొలేదు.” ఐతే యజమానుడు అతని మీద కొపపడినాడు ఎందుకంటే ఆయన వెళ్కిన నాటినుండి సోమరి అయిన ఆ దాసుడు ఏ పని చేయలేదని ఆయనకు తెలుసు. అతను తన డబ్బు తీసుకొని, నమ్మకంగా పనిచేసిన సేవకుడికి ఇచ్చాడు మరియు నమ్మకద్రోహ దాసుడను శిక్షించుటకు బంది గృహములో పడేశాడు.

ఒక పరిపూర్ణమైన రాజ్యం

ఈ కథను గొప్ప బోధకుడు మరియు కథకుడు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన ఒక రోజు మేఘారూడుడై తిరిగి వస్తాడు మరియు ప్రత్యేకమైన జనాంగమునకు, నమ్మకమైన దాసులకు, గొప్ప బహుమతులను ఇస్తాడని ఆయన గ్రంథము అయిన బైబిలు చెప్పుచున్నది. కానీ ఆయన రాకడ కొరకు సిద్ధంగా లేని వారు చాలా నిరాశ చెందుతారు.

నమ్మకమైన దాసులకు దేవుడు ఇచ్చే అద్భుతమైన బహుమానము ఏమిటి? “దేవుని రాజ్యం” గా పిలవబడే స్థలమునకు ప్రభువైన యేసుక్రీస్తు మనలను తీసుకువెళతానని వాగ్దానం చేసెను. ఈ రాజ్యం సృష్టికర్త దేవుడు నివసించే స్థలము. ప్రతి ఒక్కరూ పూర్తి సంతోషంగా ఉండే మరియు దేవుడు మానవులతో నివసించే పరిపూర్ణ ప్రదేశం. ఈ రాజ్యంలోని ప్రజలు దేవుని చట్టాలకు అనుగుణంగా మరియు ఒకరికొకరితో అనుకూలంగా జీవిస్తారు. అక్కడ దుఃఖం, బాధ, లేదా మరణం లేదు. ఈ అద్భుతమైన రాజ్యం ఎప్పటికీ అంతం కాదు! కానీ విశ్వాసకులు మరియు విధేయులు మాత్రమే ఈ ప్రదేశానికి వెళ్ళగలరు. దేవుణ్ణి తిరస్కరించేవారు లేదా ఆయనను సేవించడంలో సోమరితనం మరియు అజాగ్రత్తగా ఉన్నవారు ఆయన రాజ్యంలో ప్రవేశించరు.

దేవుని రాజ్యమును మనము సంపాదించాలంటే మన మార్గము ద్వారా సాధ్యముకాదు. ఇది జీవితకాలములో చేసిన అనేక మంచి పనుల కంటే చాలా ఖరీదైనది. దానికి బదులుగా, సృష్టికర్త దేవుడు మనకు ఉచితంగాప్రవేశ బహుమానము ఇస్తాడు. జాతి, సామాజిక స్థితి లేదా గత చరిత్రతో సంబంధం లేకుండా ఎవరైనా దేవుని రాజ్యానికి వెళ్లవచ్చు. మంచి క్రియల ద్వారా మనం ఈ రాజ్యంలోకి ప్రవేశించలేకపోయినా, మన పనులు ఎప్పటికీ ముఖ్యమైనవే. అటువంటి పరిపూర్ణమైన, సామరస్యపూర్వకమైన ప్రదేశంలో మనం సంతోషంగా ఉండే రకం మనుషులమా కాదా అని దేవుడు మన పనులను చూస్తాడు. 

మొదటి ఇద్దరు సేవకుల్లాగే—వారు చేసే ప్రతి పనిలో విశ్వాసపాత్రులైన వ్యక్తుల ప్రత్యేక గుంపు గురించి బైబిలు వివరిస్తుంది. “శేషించినవారు” అని పిలువబడే ఈ ప్రత్యేక జనాంగము, ప్రపంచంలోని ప్రతి దేశంలో దేవునికి విధేయత చూపుతారు మరియు ప్రభువైన యేసు తిరిగి రావడాన్ని శ్రద్ధగా చూస్తారు.

శేషించిన వారితో చేరడం

ఒకరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించు నమ్మకమైన ఈ దాసులైన దేవుని జనాంగములో ఎలా భాగస్వాములము కాగలము? ప్రభువైన యేసు దేవునికి నమ్మకంగా ఉండమని మనకు బోధించాడు, కానీ ఆయన సంక్లిష్టమైన నియమాల యొక్క సుదీర్ఘ జాబితాను రూపొందించలేదు. మనము పూర్ణహృదయాలతో, ఆత్మలతో, మనస్సులతో దేవుణ్ణి ప్రేమించాలని, మరియు మనలాగే మన పొరుగువారిని ప్రేమించాలని చెప్పాడు (బైబిలు, మత్తయి 22:37–40).ఇది సరళం అనిపించవచ్చు, కానీ మనలో చాలా మందికి ప్రేమలేని వ్యక్తులను ప్రేమించడం సులభం కాదు. అయినా మన శత్రువులను కూడా ప్రేమించాలని యేసు ప్రభువు చెప్పాడు (మత్తయి 5:44). దేవుడు నిగూఢంగా మన హృదయాలను మార్చివేసి, మనకు అతీంద్రియ ప్రేమను మరియు మంచితనాన్ని ఇస్తాడు కాబట్టి మాత్రమే ఇది సాధ్యము. దేవుని పట్ల ప్రేమ మరియు ఇతరుల పట్ల ప్రేమతో కూడిన జీవితమే మనం ప్రభువైన యేసు యొక్క నమ్మకమైన సేవకులమని రుజువు.

దేవుని రాజ్యంలో శాశ్వతమైన జీవము!

మొదటి ఇద్దరు సేవకుల్లాగే, దేవుని నిజమైన అనుచరులు ఓపికగా మరియు విశ్వాసపాత్రంగా ఉండాలి. మన ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు, మన విధేయత మరియు విశ్వసనీయతకు ప్రతిఫలం దేవుని రాజ్యంలోకి శాశ్వతత్వం కోసం ప్రవేశించడం. ఆ రాజ్యం “దేవుని ఆజ్ఞలను మరియు యేసు విశ్వాసమును గైకొనువారికొరకు”(బైబిలు, ప్రకటన 14:12).

మీరు దేవుని రాజ్యంలో శాశ్వతంగా జీవించే వారితో చేరాలని కోరుకుంటే, మీరు ఇలా ప్రార్థన చేయవచ్చు:

ప్రియమైన దేవా, నేను నీ రాజ్యంలో నీతో ఉండాలనుకుంటున్నాను. నాకు నేర్పండి మరియు మీరు తిరిగి వచ్చే వరకు నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయము. నన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తానన్న మీ వాగ్దానానికి ధన్యవాదాలు! ఆమెన్.

మీరు దేవుని రాజ్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ కరపత్రము వెనుక ఉన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

Copyright © 2023 by Sharing Hope Publications. అనుమతి లేకుండా వాణిజ్యేతర ప్రయోజనం కోసం పనిని ముద్రించవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు.
వాక్యము సజీవ వాహిని తెలుగు బైబిల్ 2009-2024 నుండి తీసుకోబడినది. అనుమతి ద్వారా ఉపయోగించబడుతుంది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Sign up for our newsletter

Be the first to know when new publications are available!

newsletter-cover